Homeసినిమా వార్తలుChhaava Enters into 500 Crore Club రూ.500 కోట్ల క్లబ్ లో ఛావా 

Chhaava Enters into 500 Crore Club రూ.500 కోట్ల క్లబ్ లో ఛావా 

- Advertisement -

ప్రస్తుతం బాలీవుడ్ లో విక్కీ కౌశల్, రష్మిక మందన్నాల కలయికలో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ ఛావా. మ్యాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ఆడియన్స్ ముందుకు వచ్చి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. 

చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, దివ్యా దత్త, అశుతోష్ రాణా, డయానా పెంటి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. 

కాగా ఇండియాలో ఈ మూవీ ఇప్పటికే రూ. 400 కోట్ల నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఓవరాల్ గా 500 కోట్ల క్లబ్లో అయితే నేటితో చేరనుంది. ఈ సినిమా రిలీజ్ అయిన 12 రోజుల్లోనే ఈ ఫీట్ అందుకోవటం విశేషం. ఇక నేడు శివరాత్రి కావడంతో సినిమాకు మరింత భారీ స్థాయిలో కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. 

READ  Did Mzaka get Jackpot or Disaster 'మజాకా' : జాక్ పాట్ కొడుతుందా లేక ఢమాల్ అంటుందా ?

దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగా ఇండియాలో నెట్ కలెక్షన్ సొంతం చేసుకుని గ్రాస్ పరంగా వరల్డ్ వైడ్ రూ. 700 కోట్ల వరకు అందుకునే అవకాశం కనబడుతుంది. ఇటీవల వచ్చిన బాలీవుడ్ సినిమాల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా ఛావా నిలవనుంది. మరి ఓవరాల్ గా ఇది ఎంత మేర కలెక్ట్ చేస్తుందో తెలియాలి అంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయాలి

Follow on Google News Follow on Whatsapp

READ  Game Changer Detailed Overview Explanation ​'గేమ్ ఛేంజర్' :డిటైల్డ్ ఫైనల్ ఓవర్ వ్యూ 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories