Homeసినిమా వార్తలురీ రిలీజ్ సినిమాలలో అల్ టైం రికార్డు సృష్టించిన చెన్నకేశవరెడ్డి

రీ రిలీజ్ సినిమాలలో అల్ టైం రికార్డు సృష్టించిన చెన్నకేశవరెడ్డి

- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా.. వివి వినాయక్ దర్శకత్వంలో.. బెల్లంకొండ సురేష్ నిర్మించిన మాస్ ఫ్యాక్షన్ డ్రామా ‘చెన్నకేశవ రెడ్డి’ , ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 25న మళ్లీ విడుదల కానుంది. కాగా ఆ తేదీన రెగ్యులర్ షోలు ప్రారంభం కావడానికి 24 గంటల ముందే.. అనేక ప్రీమియర్ షోలను సెప్టెంబర్ 24న నిర్వహించనున్నట్లు నిర్మాత గురువారం ప్రకటించారు.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 300కి పైగా స్క్రీన్లలో విడుదల కానుంది. పైగా విశేషం ఏమిటంటే.. ఆయా షోల ద్వారా ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమా సాధించిన వసూళ్లలో 75 శాతం బసవతారకం ట్రస్టుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈరోజు తెలిపారు.

ఇది నిజంగా ఎంతో అభినందనీయం. కేవలం అభిమానుల ఆనందం కోసం సినిమాని మళ్ళీ ప్రత్యేకంగా విడుదల చేయడమే కాకుండా.. ఆ ప్రత్యేక ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బును ఇలా సమాజానికి ఉపయోగపడే విధంగా ఇవ్వడం గొప్ప పని అనే చెప్పాలి.

READ  ఘరానా మొగుడు స్పెషల్ షోలు హిట్టా ఫట్టా?

నటసింహ బాలయ్య బాబు మరియు మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఇరువురి కెరీర్ లో ఈ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. 2002 సంవత్సరంలో విడుదలయిన చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రియ శరణ్ కథానాయికగా నటించారు. అలాగే మణిశర్మ సంగీతం అందించారు. పాటలతో పాటు ఆయన ఈ సినిమాకి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ కేవలం బాలయ్య అభిమానులనే కాక ఇతర సినీ అభిమానులను కూడా అలరిస్తుంది.

‘పోకిరి’, ‘జల్సా’ చిత్రాల తర్వాత మరో స్టార్ హీరో సినిమా భారీ హైప్‌ మధ్య ఇలా రీ రిలీజ్ కాబడుతొంది. నిజానికి గతేడాది హైదరాబాద్ లోని దేవి థియేటర్లో చెన్నకేశవరెడ్డి ఫ్యాన్స్ స్పెషల్ షో వేశారు. కరోనా పాండమిక్ టైంలోనూ థియేటర్ దద్దరిల్లిపోయే స్థాయిలో నందమూరి అభిమాన గణం రావడం విశేషం.

కాగా వచ్చే నెలలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా ‘బిల్లా’, ‘వర్షం’ తదితర సినిమాలు కూడా విడుదల కానున్నాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  బాక్సాఫీస్ వద్ద ఆల్-టైమ్ నాన్-హాలిడే రికార్డ్ ఓపెనింగ్‌ను నమోదు చేసిన బ్రహ్మాస్త్ర


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories