తెలుగు సినిమా పరిశ్రమలో మొదటి నుంచి నైజాంలో తమ సినిమాల యొక్క డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఎక్కువగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనగా దిల్ రాజు సంస్థతోనే టై అప్ అవుతుంటారు.
అయితే ప్రస్తుతం వార్ 2 నైజం రైట్స్ పరిస్థితి చూస్తే అవి ఆల్మోస్ట్ మైత్రి మూవీ మేకర్స్ కు దక్కేటువంటి అవకాశం కనబడుతోంది. వాస్తవానికి మొదటి నుంచి అటు సితార ఇటు ఎస్ వి సి సంస్థలకు మధ్య మంచి సఖ్యత ఉంది.
ఇక ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ సినిమాలు తో పాటు సితార వారి డాకు మహారాజ్ కూడా రిలీజ్ అయినప్పటికీ ఇద్దరి మధ్య మంచి అనుబంధంతో నైజాంలో థియేటర్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ లో ఎటువంటి సమస్యలు రాలేదు.
అయితే ఇప్పుడు వార్ 2 నైజాం రైట్స్ ఆల్మోస్ట్ మైత్రి వారికి దక్కే అవకాశం కనపడుతుండడంతో పరిస్థితులు అయితే మారేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఫైనల్ గా వార్ 2 నైజాం రైట్స్ మైత్రి వారికి గనుక దక్కితే ఒకింత సితార, ఎస్విసి సంస్థల మధ్య బిజినెస్ లెక్కలు మారేటువంటి అవకాశం కనబడుతోంది. అది ఒకరకంగా దిల్ రాజుకి ఎదురు దెబ్బనే అని చెప్తున్నాయి సినీ వర్గాలు.