టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగచైతన్య తాజాగా చందూ మొండేటి దర్శకత్వంలో చేస్తున్న మూవీ తండేల్. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఫస్ట్ సాంగ్ తో పాటు గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. మూవీని ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.
విషయం ఏమిటంటే, యువ నటి శోభితతో ఇటీవల చైతు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక వీరిద్దరి వివాహ వేడుక నేడు రాత్రి 8:13 నిమిషాలకు హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియో ప్రాంగణంలో వైభవంగా కుటుంబ సభ్యులు, పరిమిత అతిధుల సమక్షంలో జరగనుంది. ఇటీవల సమంత నుంచి విడాకులు తీసుకున్న అనంతరం శోభితతో ప్రేమలో పడి ఆపై ఆమెని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు నాగచైతన్య.
కాగా నేటి రాత్రి వీరిద్దరి వివాహ వేడుకకు చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి, నమ్రత, రామ్ చరణ్, ఉపాసన మరియు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు నయనతార కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు చైతు సోదరుడు అక్కినేని అఖిల్ ఇటీవల జైనాబ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కాగా వారిద్దరి వివాహ వేడుక త్వరలో జరుగనుంది మొత్తంగా అక్కినేని యువ హీరోలిద్దరి పెళ్లి వేడుకలు జరుగుతుండడంతో వారి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.