ది వారియర్ చిత్రం జులై 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్,కృతిశెట్టి జంటగా నటించనున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ది వారియర్ తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఇటీవలే ఐకానిక్ సత్యం సినిమాస్ లో ప్లాన్ చేశారు.
ఈ ఈవెంట్‌కు తమిళ ఇండస్ట్రీ నుంచి 28 మంది సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా హాజరు అవటం విశేషం. మణిరత్నం, శంకర్, విట్రిమారన్, భారతీరాజా, గౌతమ్ మీనన్, ఎస్‌జే సూర్య, భారతీరాజా, లోకేశ్ కనగరాజ్, హెచ్ వినోథ్, శశి, కార్తీక్ సుబ్బరాజు, పీఎస్ మిత్రన్, విక్రమ్ ఫ్రభు, శివ, పార్థీబన్ కార్తీ, విశాల్, కీర్తి సురేశ్ తో పాటు పలువురు నటీనటులు చీఫ్ గెస్టులుగా వచ్చారు. ఇక తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం 6 గంటలకు ఫిల్మ్ నగర్ లోని JRC కన్వెన్షన్ లో జరగనుంది.
ఈ ఏడాది ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ హిట్ తరువాత స్ట్రెయిట్ తెలుగు సినిమా ఏదీ హిట్ గా నిలిచింది లేదు. సర్కారు వారి పాట, ఫ్3 చిత్రాలు పరవాలేదు అనిపించాయి. అలాగే అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి చిన్న సినిమా కూడా ఉన్నంతలో బాగానే ఉంది అన్న పేరు తెచ్చి పెట్టుకుంది. అయితే గట్టిగా బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేసిన సినిమా ఏదీ లేదు అనే చెప్పాలి.
వరుస పెట్టి సినిమాలు రావడం వల్ల ప్రేక్షకులకు సినిమా అంటే మొహం మొత్తిన పరిస్థితి ఏర్పడింది. రెండు రాష్ట్రాల లోని చాలా ధియేటర్లు రోజు వారీ నష్టాలతో నడుస్తున్నాయి. ఈ దశలో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ది వారియర్ సినిమా అయినా తమ కష్టాలను కడతేరుస్తుంది అని డిస్ట్రిబ్యూటర్ లు ఆశతో ఉన్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో బుల్లెట్టు పాట బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సోషల్ మీడియాలో ఆ పాట హవా మామూలుగా లేదు. మిగతా పాటలకు కూడా మంచి స్పందనే వచ్చింది. ఇక ట్రైలర్ కూడా బాగుండటంతో సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులకు కూడా వచ్చింది. మరి అందరి నమ్మకాన్ని ది వారియర్ సినిమా నిలబెడుతుందా? లేదా? తెలియాలి అంటే మరో వారం ఆగాల్సిందే.