Homeసినిమా వార్తలుMagadheera: పవన్ కళ్యాణ్ రికార్డుని మగధీరతో రామ్ చరణ్ దాటగలరా?

Magadheera: పవన్ కళ్యాణ్ రికార్డుని మగధీరతో రామ్ చరణ్ దాటగలరా?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే వచ్చిన ఖుషి రీ-రిలీజ్ తో కలెక్షన్ల పరంగా భారీ రికార్డ్ సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అందరి మదిలో ప్రశ్న ఏమిటంటే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా రీ-రిలీజ్ కానున్న మగధీరతో ఆ రికార్డులను క్రాస్ చేయగలరా లేదా అనే..రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం విడుదల చేయనున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లో రెండో సినిమా “మగధీర”తో అద్భుతమైన హిట్ అందుకున్నారు. దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సంచలన చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని మార్జిన్‌తో భారీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. సినీ ప్రియులలో ట్రేడ్ రికార్డుల చర్చలో మగధీర ఇప్పటికీ కొనసాగుతోంది.

https://twitter.com/GeethaArts/status/1628613220088041474?t=W0VnJcfonGNtzChvgEtMXg&s=19

ఈ చిత్రం ఇప్పుడు రీ-రిలీజ్‌కి సిద్ధం కాబోతుంది. గత కొన్నాళ్లుగా ఈ టాక్ నడుస్తుండగా, ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈరోజున ఈ భారీ అప్‌డేట్‌ను వెల్లడించింది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు మరియు ఈ భారీ చిత్రాన్ని మరోసారి తెర పై చూడాలని ఎదురుచూస్తున్నారు.

READ  RRR: అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మాటలతో షాక్ అయిన రాజమౌళి

మగధీరలో హీరోయిన్‌గా కాజల్‌ నటించారు. కాగా రామ్‌చరణ్‌తో ఆమె కెమిస్ట్రీ ఎంతో బాగుండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో దేవ్ గిల్ విలన్ పాత్రలో నటించగా, రియల్ స్టార్ శ్రీహరి షేర్ ఖాన్ పాత్రలో అద్భుతమైన నటనతోఅందరినీ మెస్మరైజ్ చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి ఆయన పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ప్లస్‌ పాయింట్‌గా నిలిచాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  Dasara: దసరా సినిమా పై వస్తున్న పుకార్లను ఖండించిన హీరో నాని


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories