Homeసినిమా వార్తలుRRR ఆస్కార్ రేస్ లో గెలుస్తుందా?

RRR ఆస్కార్ రేస్ లో గెలుస్తుందా?

- Advertisement -

భారతీయ సినిమా చరిత్రలో ఆస్కార్ అవార్డు సాధించడం అనేది అన్ని పరిశ్రమల వారికి ఒక కలగానే మిగిలిపోయింది. ఎందుకంటే సినిమాలకు సంబంధించిన అవార్డులకు ఆస్కార్‌ పెద్ద వేదిక. ప్రపంచ వ్యాప్తంగా చాలా సంవత్సరాలుగా అసాధారణమైన సినిమా అవార్డుగా ఖ్యాతిని పొందింది. అయినప్పటికీ, ఆస్కార్ అవార్డు గ్రహీతలలో ఎక్కువ భాగం అమెరికన్ సినిమాలే ఉన్నాయి. మన భారతీయ సినిమాలేవీ ఇంత వరకూ ఈ అవార్డును గెలవలేకపోయాయి. ఈ వైఫల్యానికి వివిధ కారణాలు ఉండవచ్చు. అయితే భాషా మరియు దేశాల మధ్య అడ్డంకులను ఛేదిస్తూ నాలుగు భారతీయ సినిమాలు ఆస్కార్‌కు నామినేట్ చేయబడ్డాయి.

1957లో విడుదలైన మదర్ ఇండియా..1988లో వచ్చిన సలామ్ బాంబే, 2001లో విడుదలైన లగాన్, 2021లో రైటింగ్ విత్ ఫైర్ (Writing With Fire) (Documentary) ఇన్ని సంవత్సరాలలో ఈ నాలుగు సినిమాలు మాత్రమే మన దేశం నుంచి ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యాయి.

ఐతే ఈసారి మాత్రం ఒక భారతీయ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో ఎంపికవడమే కాకుండా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఒక తెలుగు సినిమా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ సినిమా మరేదో కాదు మన దర్శకధీర రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఈసారి ఖచ్చితంగా అకాడెమీ అవార్డు గెలుచుకుంటుందని భావిస్తున్నారు.

ఆర్.ఆర్.ఆర్ చిత్రం భారత దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా విశేషమైన ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాని ధియేటర్లలో చూసిన ప్రేక్షకులు భారీ స్థాయిలో మెచ్చుకున్న తరువాత.. ఓటిటి రిలీజ్ గా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన తరువాత మరింత రీచ్ మరియు క్రేజ్ ను దక్కించుకుంది. హాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులను కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ అంత సులువుగా దక్కటం మాత్రం సాధ్యం కాదు. కొందరు విశ్లేషకుల ప్రకారం ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ రావాలంటే అందుకు ప్రచారం చాలా అవసరం. దాని కోసం కనీసం 5 మిలియన్ డాలర్లు అయినా ఖర్చు చేయాల్సి ఉంటుందని ఒక వాదన వినిపిస్తోంది. అయితే ఆస్కార్ లాంటి వేదిక పై మన తెలుగు సినిమా అయిన ఆర్ ఆర్ ఆర్ మెరిస్తే అది ఖచ్చితంగా తెలుగు జాతికి గర్వకారణం అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

READ  తెలుగు సినీ పరిశ్రమ పై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు

రాజమౌళి దర్శకత్వంలో ఇదివరకు వచ్చిన భారీ ప్యాన్ ఇండియా సినిమాలైన బాహుబలి ఫ్రాంఛైజీ కంటే ఆర్.ఆర్.ఆర్ సినిమా కంటెంట్ పరంగా చాలా గొప్పదని.. అందుకే ఈ చిత్రం ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం ఖాయమని గత కొద్ది రోజులుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ముఖ్యంగా విదేశీయులు సైతం ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ అవార్డ్ రావాలని కోరుకుంటున్నారంటే సినిమా ఏ స్థాయిలో వారిని ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.

పాపులర్ హాలీవుడ్ మ్యాగజైన్ ‘వెరైటీ’ ఇటీవలే ప్రచురించిన ఓ కథనంలో ఎన్టీఆర్ పేరును ప్రస్థావించడం అందరిలోనూ సంచలనంగా నిలిచింది. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా మొత్తంగా ఐదు విభాగాలలో ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి అంటున్నారు. ఉత్తమ నటుడు విభాగంలో ఎన్టీఆర్, రామ్ చరణ్.. అలాగే రాజమౌళి పేరును ఉత్తమ దర్శకుడు విభాగంలో.. ఉత్తమ చలనచిత్ర అవార్డు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో దోస్తీ పాట.

READ  ఆస్కార్ అవార్డులకు ఆర్ ఆర్ ఆర్ ఎంట్రీ?

నిజానికి ఈ సినిమాకి ఆస్కార్ వస్తుందని ముందుగా ఎవరూ ఊహించలేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన భారీ ప్రశంసల వల్ల అందరిలోనూ ఆస్కార్ ఆశలు చిగురించాయి. గతంలో స్లమ్ డాగ్ మిలియనీర్ తరహాలో ఆర్.ఆర్.ఆర్ కూడా సంచలనం సాధిస్తుందని, భారతదేశానికి గౌరవం తీసుకు వస్తుందని ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నారు.

రామ్ చరణ్ – ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ కమర్షియల్ గా ప్యాన్ ఇండియా కేటగిరీలో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 1200 కోట్లకు పైగా వసూలు చేసింది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories