Homeసినిమా వార్తలుPS-2: వేసవి నుండి వాయిదా పడిన కోలీవుడ్ ప్రైడ్ పొన్నియన్ సెల్వన్

PS-2: వేసవి నుండి వాయిదా పడిన కోలీవుడ్ ప్రైడ్ పొన్నియన్ సెల్వన్

- Advertisement -

మణిరత్నం యొక్క మాస్టర్ పీస్ పొన్నియిన్ సెల్వన్-1కి సీక్వెల్ అయిన పొన్నియిన్ సెల్వన్-2 సినిమాకి సంభందించిన ఒక తాజా వార్త తమిళ ప్రేక్షకులకు మరియు సినీ ప్రేమికులకు షాక్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల కావాల్సిన తేదీని వాయిదా వేసినట్లు సమాచారం అందింది.

వాస్తవానికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28, 2023న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నిరవధికంగా వాయిదా పడిందని సోషల్ మీడియాలో కొత్త గాసిప్ హల్ చల్ చేస్తోంది. సాంకేతిక కారణాల వల్లే సినిమా వాయిదా పడిందనే రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇది ఖచ్చితంగా తమిళ ప్రేక్షకులని నిరాశపరుస్తుంది. మొదటి భాగం, పొన్నియిన్ సెల్వన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది మరియు ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు వసూలు చేసింది మరియు ఇది తమిళనాడులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అందుకే ఈ సీక్వెల్‌ పై భారీ అంచనాలు ఏర్పరచుకున్న ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

READ  Chiyaan Vikram: ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాలో విలన్ గా చియాన్ విక్రమ్??

ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్ బచ్చన్ మరియు జయం రవి ప్రధాన నటులుగా నటించగా.. వారితో పాటు ప్రభు, ప్రకాష్ రాజ్, జయరామ్, రెహమాన్, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, పార్తీబన్ తదితరులు మొదటి భాగం నుంచి తమ తమ పాత్రల్లో కొనసాగనున్నారు.

పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రాన్ని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ప్రముఖ భారతీయ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి మద్రాస్‌ మొజార్ట్ గా పేరు పొందిన ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Aishwarya Rai: అజిత్ సినిమాలో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories