Homeసినిమా వార్తలురెండో వారాంతంలో బాక్స్ ఆఫీస్ వద్ద పుంజుకున్న బ్రహ్మస్త్ర

రెండో వారాంతంలో బాక్స్ ఆఫీస్ వద్ద పుంజుకున్న బ్రహ్మస్త్ర

- Advertisement -

బాలీవుడ్ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు అద్భుతమైన హైప్ ను సొంతం చేసుకుంది. అందుకు కారణం విస్తృత స్థాయిలో చేసిన ప్రచారం. సూపర్ హీరో తరహా కాన్సెప్ట్ తో ప్రేక్షకులకి విపరీతమైన ఆసక్తి కలిగించడంతో.. బ్రహ్మస్త్ర భారీ కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద ఘనంగా ఆరంభమయింది. అదే ఊపును కొనసాగిస్తూ మూడు రోజుల వరకు మంచి కలెక్షన్లను రాబట్టింది.

ఐతే ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. అలాగే చక్కని ఓపెనింగ్స్ తర్వాత మంచి సోమవారం నుంచి నిలకడగా వసూళ్లు సాధించడంలో విఫలమైంది. సినిమాలోని వీఎఫ్‌ఎక్స్‌, సీజీఐ వర్క్‌ని చూసిన ప్రేక్షకులు మెచ్చుకున్నా, కథకు తగ్గట్లుగా ఫాంటసీ ఎలిమెంట్స్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రేమకథకు ఎక్కువగా చూపెట్టడం వారిని విపరీతంగా నిరుత్సాహపరిచింది.

ఇక ఓపెనింగ్ వీకెండ్ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద మిగతా రోజుల్లో చతికిలపడ్డ తర్వాత, ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరింత కుదేలవుతుందని అందరూ భావించారు. అయితే రెండవ వీకెండ్లో వచ్చిన కలెక్షన్స్ మళ్ళీ మెరుగవ్వడం చిత్ర బృందానికి కొంత ఆశను కలిగించింది. బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వద్ద శనివారం భారీ వసూళ్లను సాధించింది.

READ  హ్యాపీ బర్త్ డే ఓటిటి రిలీజ్ ఈరోజే

ఈ చిత్రం శనివారం నాడు దాదాపు 17 కోట్ల నెట్ కలెక్షన్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఆదివారం అయిన ఈరోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా ఈరోజు 20 కోట్లకు పైగా నెట్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. బ్రహ్మాస్త్ర ఈరోజుతో 200 కోట్ల నెట్ మార్క్‌ని దాటుతుంది. ఇలాగే కొనసాగితే సినిమా మొత్తం రన్‌లో 300 కోట్ల మార్క్ ను సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ భారీగా ఉండటంతో మొత్తంగా యావరేజ్ మార్కును అందుకుంటుంది.

బ్రహ్మాస్త్ర చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున మరియు మౌని రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి రచయితతో పాటు దర్శకుడుగా కూడా వ్యవహరించారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  స్టార్ డైరెక్టర్లు మాత్రమే కావాలి అంటున్న తెలుగు హీరోలు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories