Homeసినిమా వార్తలుభారీ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన బ్రహ్మస్త్ర

భారీ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన బ్రహ్మస్త్ర

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ మరియు నేటితరంలో అత్యంత క్రేజ్ తో పాటు అద్భుతమైన ప్రతిభ గల హీరోయిన్/నటి అలియా భట్ జంటగా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. వారిద్దరూ నిజ జీవితంలో భార్యాభర్తలు అన్న విషయం తెలిసిందే. తొలిసారి వారు కలిసి నటించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.

యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎనిమిదేళ్లకు పైగా కష్టపడి అత్యంత ప్రతిష్టాత్మకంగా మరియు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవగా.. రివ్యూలు మరియు టాక్ పరంగా కాస్త మిశ్రమ స్పందనను తెచ్చుకుంది.

అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం బ్రహ్మాస్త్ర అద్భుతంగా కలెక్షన్లు రాబడుతోంది. కాగా ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద ప్రదర్శింపబడుతున్న తీరును చూసి పలువురు సినీ ఔత్సాహికులు బాలీవుడ్ ఈజ్ బ్యాక్.. బ్రహ్మాస్త గోల్డెన్ రన్ అంటూ కితాబు ఇస్తున్నారు. కాగా ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద నిలకడగా రాణించడం అటు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు ఇటు రణబీర్ కపూర్ అభిమానులకు కూడా ఓకే సమయంలో ఆనందాన్ని మరియు ఆశ్చర్యాన్ని కలిగించింది.

READ  బ్రహ్మస్త్ర ప్రి రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. ఈవెంట్ బదులు ప్రెస్ మీట్ పెట్టిన చిత్ర బృందం

నిజానికి విడుదలకు ముందే బ్రహ్మాస్త్ర సినిమా పై భారీ అంచనాలు నెలకొని ఉన్నప్పటికీ, ప్రస్తుతం గడ్డు కాలం ఎదుర్కుంటున్న బాలీవుడ్ నుండి ఇంత భారీ ఓపెనింగ్స్ నమోదు చేసే సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేదు.

కాగా మొదటి రోజు బ్రహ్మాస్త్ర ప్రపంచవ్యాప్తంగా 68 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది, మరియు రెండవ రోజు ఆ నంబర్ పెరిగి 75 కోట్ల కంటే ఎక్కువ గానే వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక మూడవ రోజు అడ్వాన్స్ ట్రెండ్ లని బట్టి చూస్తుంటే మూడవ రోజు అత్యధికంగా వసూళ్లు రాబట్టే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాటికి ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను చాలా సునాయాసంగా దాటేసేలా కనిపిస్తుంది.

ఇది నిజంగా బాలీవుడ్ కు మరియు బ్రహ్మస్త్ర సినిమాకి అద్భుతమైన వీకెండ్ గా మారబోతుంది. కాగా అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ వంటి వరుస భారీ డిజాస్టర్‌లతో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్‌కి ఇది చాలా అవసరమైన విజయం అని చెప్పాలి.

బాలీవుడ్ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా బ్రహ్మాస్త్ర సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో అలియా భట్ తో పాటు అమితాబ్ బచ్చన్, నాగార్జున కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ప్యాన్-ఇండియా స్థాయిలో విడుదలైంది. కాగా దర్శకుడు అయాన్ ముఖర్జీ మరియు నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు ప్రధాన తారాగణం సినిమా విడుదల తరువాత కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారు.

READ  బ్రహ్మస్త్ర - ఓకే ఒక జీవితం ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories