Homeసినిమా వార్తలుBox-Office: కార్తీకేయ-2 7 డేస్ హిందీ కలెక్షన్స్

Box-Office: కార్తీకేయ-2 7 డేస్ హిందీ కలెక్షన్స్

- Advertisement -

యువ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద తన అద్భుతమయిన రన్ ను కొనసాగిస్తుంది. థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి ఎక్కడ చూసినా సినిమా గురించే చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ముందు నుంచే ఈ సినిమా పట్ల ప్రేక్షకులు అమితమైన ఆసక్తిని కనబరిచారు. అందువల్ల తెలుగులో విజయం సాధించడం అర్థం చేసుకోవచ్చు. కానీ హిందీ వెర్షన్ ఘన విజయం సాధించడం మాత్రం ఎవరూ ఊహించి ఉండరు.

కార్తికేయ 2 హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు 7 లక్షల నెట్ తో మొదలైంది. కానీ సినిమా చూసిన ఉత్తరాది ప్రేక్షకులు సూపర్ టాక్ ఇచ్చారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి ధియేటర్లు మరియు షోలు పెంచాలంటూ సినిమాకి మద్దతు పలికారు. దాంతో రోజు రోజుకూ కార్తీకేయ 2 సినిమాకి స్క్రీన్ లతో పాటు కలెక్షన్లు పెరిగాయి.

అలా సినిమా చుట్టూ ఉన్న పాజిటివ్ బజ్ కారణంగా, చిత్రం రెండవ రోజు కలెక్షన్ల 28 లక్షలకు చేరుకుంది.మూడవ రోజు 1.10 కోట్లకు చేరుకోగా, నాలుగో రోజు 1.28 కోట్లను రాబట్టింది. మామూలుగా అయితే రోజులు గడుస్తున్న కొద్దీ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవుతాయి కానీ కార్తికేయ 2 మాత్రం అందుకు విరుద్ధంగా రోజు రోజుకూ కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. ఇంక పెరిగిన స్క్రీన్స్ సహాయంతో అయిదవ రోజు 1.38 కోట్లతో నిలిచింది. ఆ పైన ఆరవ రోజు 1.68 కోట్లను సంపాదించుకుంది.

READ  పవన్ కళ్యాణ్ హారి హర వీర మల్లు షూటింగ్ ఈసారైనా మొదలవుతుందా?

7వ రోజు శ్రీ కృష్ణ జన్మాష్టమి అవడంతో మంచి వసూళ్లు రాబట్టింది. జన్మాష్టమి పండుగ మరియు హాలిడే అడ్వాంటేజ్ కారణంగా, కార్తికేయ 2 సినిమా ఈ ఒక్క రోజే 2.46 కోట్ల వసూళ్లు రాబట్టింది. అదే జోరును కొనసాగిస్తూ రెండో వారాంతంలో మొదటి మూడు రోజుల కంటే 4-5 రెట్లు ఎక్కువ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మొత్తంగా కార్తికేయ 2 7 రోజుల తర్వాత 8.21 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించడం విశేషం. మొత్తంగా విడుదలకు ముందు అనిశ్చితిని కలిగి ఉన్న కార్తీకేయ 2 చిత్రం ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం అందరికీ ఆనందాన్ని ఇచ్చింది.

Follow on Google News Follow on Whatsapp

READ  OTT : డార్లింగ్స్ రివ్యూ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories