Homeబాక్సాఫీస్ వార్తలుBox-Office: 100 కోట్ల అరుదైన క్లబ్ లో చేరిన కార్తీకేయ-2

Box-Office: 100 కోట్ల అరుదైన క్లబ్ లో చేరిన కార్తీకేయ-2

- Advertisement -

నిఖిల్ సిద్ధార్థ,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన అడ్వెంచర్ థ్రిల్లర్ `కార్తికేయ 2` ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆగస్ట్ నెలలో బింబిసార, సీతా రామం అందించిన శుభారంభాన్ని కార్తీకేయ 2 సినిమా మరింత ముందుకు తీసుకు వెళ్ళింది. థియేటర్ల వద్ద ఎన్నో రోజులకు ప్రేక్షకులు క్యు కట్టటం, హౌజ్ ఫుల్ బోర్డులను నమోదు చేయడం ఈ సినిమా తోనే సాధ్య పడింది. బాక్స్ ఆఫీస్ వద్ద కార్తీకేయ 2 లాంగ్ రన్ అద్భుతంగా ఉంది. కాగా కలెక్షన్లతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రంగాల ప్రేక్షకుల నుండి ఈ చిత్రం ప్రశంసలు అందుకుంటోంది.

ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ వద్ద అయితే అనూహ్యమైన స్పందన రాబట్టింది. తొలి రోజు తక్కువ ధియేటర్లలో విడుదలై కేవలం 7 లక్షల నెట్ సంపాదించిన కార్తీకేయ 2 చిత్రం, టాక్ తో పాటు థియేటర్లను కూడా పెంచుకుని మొత్తంగా మూడు వారాల వద్దకు వచ్చేసరికి 24 కోట్ల నెట్ కలెక్షన్లను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే ఈ చిత్రం దాదాపు 68 లక్షలు కొల్లగొట్టింది. బ్రహ్మాస్త్ర విడుదలయ్యే వరకు ఈ తెలుగు సినిమాకు వీలైనన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రెండ్ ను బట్టి చూస్తే ఈ సినిమా ఫుల్ రన్ లో ఖచ్చితంగా 30 కోట్ల మార్క్ ను చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారకా నగరం మరియు శ్రీకృష్ణుడి చరిత్ర నేపథ్యంలో రూపొందింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. అనుపమ్ ఖేర్ – శ్రీనివాస రెడ్డి- వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు.

READ  Box-Office: కార్తీకేయ-2 16 డేస్ కలెక్షన్స్

100 కోట్లు అనేది మీడియం బడ్జెట్ లేదా చిన్న సినిమాల వరకు ఒక అరుదైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. అలాంటి అరుదైన ఘనతను ఈ రోజుతో కార్తికేయ2 సాధించింది. ఇది ఖచ్చితంగా అపూర్వమైన, అసాధారణమైన విజయంగా పరిగణించవచ్చు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంతటి సంచలన స్థాయిలో ప్రదర్శింపబడుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ రోజు నాటికి ఈ సినిమా 50 కోట్ల షేర్ మార్క్ ని కూడా క్రాస్ చేసింది. నిఖిల్ కెరీర్ లో మరిచిపోలేని బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలోనే ఒక అద్భుతమైన సినిమాగా నిలిచింది.

కేవలం హిందీ లోనే మొత్తం రన్ పూర్తయ్యే వరకు 30కోట్ల క్లబ్ ని చేరుకునే దిశగా దూసుకుపోతున్న కార్తికేయ 2 చిత్రం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ వద్ద కూడా అద్భుతమైన వసూళ్లను సాధించింది. కాగా కార్తికేయ 2 తరువాత హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన మరో సినిమా 18 పేజస్ త్వరలోనే విడుదల కానుంది.

READ  పిల్లలు లేకపోవడం పై స్పందించిన బ్రహ్మాజీ

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories