Homeసినిమా వార్తలుKabzaa - PAPA: బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసిన కబ్జా, ఫలానా అబ్బాయి...

Kabzaa – PAPA: బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసిన కబ్జా, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి

- Advertisement -

ఈ వారంలో విడుదలైన సినిమాలయినా వరుసగా పేలవమైన ఫలితాలు, లోటుపాట్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయని తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల యజమానులు ఆశించారు కానీ కొత్తగా విడుదలైన సినిమాలు రెండూ బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి.

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాకి తొలిరోజే చాలా సెంటర్లలో డెఫిషిట్ లు నమోదు కాగా కబ్జా సినిమాకు విడుదలకు ముందే మంచి హైప్ రావడంతో సినిమా మార్నింగ్ షోలు డీసెంట్ గా ప్రారంభమయ్యాయి. అయితే బ్యాడ్ టాక్ కారణంగా ప్రతి షోకూ కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి. ఇక ఈ రోజు మార్నింగ్ షోలకు కూడా తక్కువ ఆక్యుపెన్సీ నమోదైంది.

కబ్జా మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ అయ్యేందుకు అన్ని అవకాశాలు ఉన్నా కానీ ఎమోషనల్ ఇంపాక్ట్ లేకుండా కేజీఎఫ్ సిరీస్ కు సంబంధించిన స్పూఫ్ గా అనిపించడం, ఆర్టిఫిషియల్ టేకింగ్ ఉండటం వల్ల ఎంగేజింగ్ సినిమా తీయడంలో దర్శకుడు విఫలమయ్యారు.

అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ ఆయన ఎంచుకున్న కథనం సినిమాకు మైనస్ అయ్యింది. ఈ చిత్రంలో ప్రధాన జంటగా నటించిన మాళవిక నాయర్, నాగశౌర్య మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటు వారి కెమిస్ట్రీ కూడా సూపర్బ్ గా ఉంది. ఈ రొమాంటిక్ డ్రామాలో పాటలు, కొన్ని సన్నివేశాలు బాగున్నాయి కానీ పైన చెప్పినట్లు చాప్టర్ – వైజ్ కథనం ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు.

Follow on Google News Follow on Whatsapp

READ  RRR: USA రీ రిలీజ్ వీకెండ్ లో కోటికి పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories