‘బాస్ పార్టీ’, ‘జై బాలయ్య’ అనే రెండు పాటలను వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల యూనిట్లు తాజాగా విడుదల చేసాయి. ఈ రెండు సినిమాల పై మంచి హైప్ ఉన్నందున ఈ పాటలు చార్ట్ బస్టర్స్ అవుతాయని అందరూ ఆశించారు.
2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. వారు ఇటీవల వారి సినిమాల లోని మొదటి సింగిల్స్ ను చాలా హైప్ తో విడుదల చేశారు. ఇది హీరోల అభిమానులు ఈ పాటలను వినడానికి ఉత్సాహంగా కూడా ఉన్నారు.
అయితే పాటలను విడుదల చేసిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. రెండు పాటలు కూడా యూట్యూబ్ లో మంచి వ్యూస్ పొందడంలో విఫలమయ్యాయి. ఆ రకంగా పాటలకు ఆశించిన ప్రశంసలు రాలేదనే చెప్పాలి.
మెగాస్టార్ మూవీ వాల్తేరు వీరయ్య చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేవి ప్రస్తుతం తన టాప్ ఫామ్ లో లేరు, కానీ ఆయన మాంచి ఊపు ఇచ్చే ఐటమ్ నంబర్లను సృష్టిస్తారని పేరు తెచ్చుకున్నారు. కాగా ఆయన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి.
అయితే బాస్ పార్టీ సాంగ్ యూట్యూబ్ లో ఆశించిన స్థాయిలో వ్యూస్ రాబట్టలేకపోయింది. 13 రోజుల్లో కేవలం 20 మిలియన్ వ్యూస్ మాత్రమే రాబట్టగలిగింది. ఈ పాటలో డిఎస్పి పాడిన తీరు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ట్రోల్ చేయబడింది.
ఇక వీరసింహారెడ్డి విషయానికి వస్తే జై బాలయ్య పాటను మాస్ గీతంగా అభివర్ణిస్తూ చిత్రబృందం విడుదల చేసింది. ఓసేయ్ రాములమ్మ, వచ్చాడయ్యో సామి (భరత్ అనే నేను) పాటలలా ఈ పాట ఉంది. ప్రేక్షకులకి ఈ పాట ట్యూన్ ఫ్రెష్ గా అనిపించలేదు కానీ విజువల్స్ ఓకే అనిపించాయి. ఈ పాటకు 11 రోజుల్లో కేవలం 13 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల నుంచి వచ్చే మిగతా పాటలు 50 మిలియన్ వ్యూస్ తో చార్ట్ బస్టర్ అవుతాయని ఆశిస్తున్నాం. రెండు సినిమాలకూ హైప్ పెంచే బాధ్యత ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్, తమన్ ఎస్ వంటి సంగీత దర్శకుల పైనే ఉంది.