Homeసినిమా వార్తలుబాలీవుడ్ నుంచి ఏకంగా 500 కోట్ల భారీ ఆఫర్ దక్కించుకున్న వివి వినాయక్

బాలీవుడ్ నుంచి ఏకంగా 500 కోట్ల భారీ ఆఫర్ దక్కించుకున్న వివి వినాయక్

- Advertisement -

ఎస్ ఎస్ రాజమౌళి కెరీర్ లో అత్యంత ప్రసిద్ధ చెందిన చిత్రాలలో చత్రపతి సినిమా ఒకటి. కాగా తాజాగా ఈ చిత్రాన్ని దర్శకుడు వివి వినాయక్ హిందీలో రీమేక్ చేయనున్నట్లు కొన్ని నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయాలని వినాయక్‌ భావించారు.

ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా మీడియాతో జరిగిన సమావేశంలో, నిర్మాత బెల్లంకొండ సురేష్.. హిందీ ఛత్రపతి గురించి మాట్లాడారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయిందని ఆయన తెలిపారు. అయితే, డబ్బింగ్ పనులు మరియు కొన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ భాగాలకు సంభందించిన పనులు మాత్రం ఇంకా పూర్తి కావాల్సి ఉందని అన్నారు.

భారీ సినిమా అయినప్పటికీ. వినాయక్ ఈ సినిమాను కేవలం 80 రోజుల్లో పూర్తి చేశారట. ఇక ఈ సినిమా షూటింగ్‌కి తగిన తేదీలు హీరోయిన్‌ ఇవ్వలేదని బెల్లంకొండ ఫిర్యాదు కూడా చేయడం గమనార్హం. అందువల్లే షూటింగ్ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టిందట.

READ  రీ రిలీజ్ సినిమాలలో అల్ టైం రికార్డు సృష్టించిన చెన్నకేశవరెడ్డి

అంతే కాకుండా బెల్లంకొండ సురేష్.. చత్రపతి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని చూడాలని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తిగా ఉన్నారని, అలాగే మొదటి సారి ఈ సినిమాని వీక్షించిన తర్వాత వారు వివి వినాయక్‌ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకుని ఆయనకు మరో సినిమాను ఆఫర్ చేశారని చెప్పారు. ఏకంగా 500 కోట్ల బడ్జెట్‌తో తమ కోసం ఓ భారీ సినిమా చేయమని వారు వినాయక్‌కు ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్‌కు మరో రెండు మూడు నెలలు పడుతుందని, 2023 ప్రారంభంలో ఈ సినిమా విడుదలవుతుందని ఆయన చెప్పారు.

దర్శకుడిగా వి వి వినాయక్ కెరీర్లో ప్రస్తుతం సరైన హిట్ సినిమా లేదు. ఆయన ఒక తెలుగు సినిమా తెరకెక్కించి చాలా కాలం అయింది. ఇప్పుడు హిందీ చత్రపతి రీమేక్ గురించి వినిపిస్తున్న ఈ పాజిటివ్ న్యూస్ వింటుంటే.. ఆయన తప్పకుండా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేలానే ఉన్నారు. ఈ విజయంతో అక్కడే ఆగిపోకుండా మళ్ళీ వరుసగా ఆయన సినిమాలు చేస్తారని కోరుకుందాం.

READ  సారీ చందూ అలా అనడం నా తప్పు - అనుపమ పరమశ్వేరన్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories