దాదాపు 23 ఏళ్ల తర్వాత దక్షిణాది సూపర్ స్టార్ అజిత్ కుమార్ తో కలిసి ఐశ్వర్యారాయ్ బచ్చన్ కలిసి నటించనున్నారట. తాజాగా 2023 పొంగల్ కు అజిత్ నటించిన తాజా చిత్రం “తునివు” విడుదల కాగా, ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది.
హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీకపూర్ నిర్మించిన ఈ చిత్రంలో సముద్రఖని, మంజు వారియర్ తదితరులు నటించారు. ఈ సినిమా తర్వాత సౌత్ సూపర్ స్టార్ అజిత్ AK62 లో (working title) నటిస్తుండగా, ఈ బిగ్ బడ్జెట్ మూవీకి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్ బచ్చన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.
విఘ్నేష్ శివన్ సినిమాలకు రెగ్యులర్ మెంబర్ గా ఉండే అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నటుడు అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో భాగం కానున్నారని వార్తలు ఇదివరకే రాగా, ఇప్పుడు ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటిస్తుందనే వార్త బయటకు రావడంతో సినిమా పై అంచనాలు మరో స్థాయిలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా AK62 నిర్మాతలు ఈ మాజీ మిస్ వరల్డ్ తో సంప్రదింపులు జరిపారని, అన్నీ సవ్యంగా జరిగితే 23 ఏళ్ల తర్వాత ఆమె అజిత్ తో కలిసి నటించనున్నారని సమాచారం. అజిత్, ఐశ్వర్య చివరిసారిగా రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించిన కందు కొండేన్ కందు కొండేన్ (2000) చిత్రంలో కలిసి నటించారు.
ఈ చిత్రంలో అజిత్ సరసన టబు హీరోయిన్ గా నటించగా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి జోడీగా ఐశ్వర్యారాయ్ నటించారు. ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ రీయూనియన్ ను ఇష్టపడతారు, వారితో పాటు మేం కూడా అజిత్ – ఐశ్వర్య యొక్క పునరాగమనాన్ని చూడటానికి ఎదురుచూస్తున్నాము.