Homeసినిమా వార్తలుBlockbuster Bookings for Salaar Re Release 'సలార్' రీ రిలీజ్ కి బ్లాక్ బస్టర్...

Blockbuster Bookings for Salaar Re Release ‘సలార్’ రీ రిలీజ్ కి బ్లాక్ బస్టర్ బుకింగ్స్ 

- Advertisement -

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవల కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియ రెడ్డి, ఝాన్సీ, బాబీ సింహా, బ్రహ్మాజీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. 

హోంబలే ఫిలిమ్స్ సంస్థ పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో నిర్మించిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. భారీ యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ వంటివి ఈ మూవీలో అందరినీ ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా ఈ మూవీ రూ. 600 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది.

విషయం ఏమిటంటే, మార్చి 21న గ్రాండ్ గా రీ రిలీజ్ కి రెడీ అయిన ఈమూవీ యొక్క ప్రీ బుకింగ్స్ నిన్నటి నుండి ఓపెన్ చేయగా గడచిన 24 గంటల్లో బుక్ మై షోలో మొత్తంగా సలార్ మూవీ 25,000 టికెట్ బుకింగ్స్ తో మంచి రికార్డు నెలకొల్పింది. కాగా రీ రిలీజ్ సినిమాల్లో ఇప్పటివరకు సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి 24 గంటల్లో 41,700 టికెట్ బుకింగ్స్ తో హైయెస్ట్ బుకింగ్స్ సొంతం చేసుకున్న మూవీగా టాప్ లో ఉంది. మరి టోటల్ గా రీ రిలీజ్ లో సలార్ ఎంతమేర కెలెక్ట్ చేస్తుందో చూడాలి. 

READ  Thandel Telugu States Ticket Rates తెలుగు రాష్ట్రాల్లో 'తండేల్' టికెట్ రేట్స్ ఇవే 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories