Homeసినిమా వార్తలుబ్లాక్ బస్టర్ బింబిసార ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్

బ్లాక్ బస్టర్ బింబిసార ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్

- Advertisement -

బింబిసార బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో మంచి ఊపు మీద ఉన్నారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కళ్యాణ్ రామ్ కెరీర్-బెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అంతే కాకుండా ఇంతకు ముందు ఆయన కెరీర్లో ఇంతకు ముందు అతి పెద్ద హిట్ అయిన పటాస్ సినిమా కలెక్షన్లను కేవలం 5 రోజుల్లోనే దాటేయడం విశేషం. కాగా బింబిసార చిత్రం అద్భుత విజయం సాధించిన తర్వాత అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్‌ పైనే ఉంది.

ఇక బింబిసార సినిమా OTT విడుదలను తాజాగా ఖరారు చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని మెచ్చుకోవాల్సిన విషయం ఒకటుంది. మిగతా సినిమాల లాగా విడుదలకు ముందు ఆలస్యంగా OTT లో విడుదల చేస్తామని చెప్పి నాలుగైదు వారాలకే ఆ పని చేయకుండా.. కొత్త నిభందనలు పాటిస్తూ.. సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాత అంటే అక్టోబర్ 7న ఈ ఫాంటసీ-యాక్షన్ చిత్రం Zee 5 ప్లాట్ ఫారంలో విడుదల కానుంది.

500 BC నేపథ్యంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ చిత్రం.. బింబిసార (కళ్యాణ్ రామ్) అనబడే ఒక నియంత లాంటి రాజు గురించి మనకు చెప్పిన కథ. తన రాజ్యంలో ఏదైనా అసమ్మతి వస్తే దానిని అణిచివేసేందుకు ఎంతటి తీవ్ర చర్యలైనా తీసుకునే క్రూరమైన అధికార దాహం కలిగిన రాజు అయిన బింబిసార.. అనుకోకుండా టైం ట్రావెల్ చేసి కలియుగంలోకి రావడం.. ఆ తర్వాత పరివర్తన చెంది ఒక మంచి మనిషిగా మారడం అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.

READ  Box-Office: కార్తీకేయ-2 7 డేస్ హిందీ కలెక్షన్స్

కాగా బింబిసార చిత్రం మొదటి రోజు నుండి చక్కని సమీక్షలతో పాటు బాక్స్ ఆఫీసు వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్.. ఆ తర్వాత మంచి లాంగ్ రన్ తెచ్చుకుంది. అలాగే సినిమాతో అనుసంధానం అయిన వారందరికీ మంచి లాభాలను అందించింది. నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, సంయుక్తా మీనన్ మరియు వివాన్ భటేనా కీలక పాత్రల్లో నటించారు. కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  అనసూయ కు కౌంటర్ గా బ్రహ్మాజీ "అంకుల్" ట్వీట్?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories