Homeసినిమా వార్తలుసూర్యకు షాక్ ఇచ్చిన శంకర్.. భారీ ప్యాన్ ఇండియా సినిమాకు బాలీవుడ్ హీరోతో జోడీ

సూర్యకు షాక్ ఇచ్చిన శంకర్.. భారీ ప్యాన్ ఇండియా సినిమాకు బాలీవుడ్ హీరోతో జోడీ

- Advertisement -

ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమా అనే కాదు కన్నడ హిందీ మలయాళం ఇలా ప్రతీ ఇండస్ట్రీ లో కూడా ఆసక్తికరమైన భారీ బడ్జెట్ సినిమాలు లేదా చారిత్రాత్మక నేపథ్యంలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. బాహుబలి, పోన్నియిన్ సెల్వన్ సినిమాల తరువాత మరోసారి దక్షిణ భారత సినీ పరిశ్రమ నుండి ఒక భారీ ప్రాజెక్ట్ సిద్ధం కానుంది.

వేల్పారి అనేది ఒక తమిళ రాజు పేరు. మూడు గొప్ప రాజవంశాలైన, చోళులు, చేరులు మరియు పాండ్యులను సవాలు చేస్తూ భయంకరమైన పాలకుడిగా పేరు పొందాడు. అతని పై రచించిన ఒక నవల ఎంతో ప్రసిద్ధి పొందింది. మరియు ఆ నవల పై సినిమా తీయడం అనేది చాలా మంది పెద్ద దర్శకులు ఎప్పటి నుంచో కలగా ఉంటూ వచ్చింది.

తమిళ స్టార్ హీరో సూర్య టైటిల్ రోల్‌లో వేల్పారి నవల ఆధారంగా ఒక చిత్రాన్ని శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు గతంలో పుకార్లు బలంగా వచ్చాయి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా దర్శకుడు శంకర్ ఈ వేల్పారి నవల యొక్క అనుసరణ కోసం బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను ఎంచుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు.

READ  అప్పుడే ఓటిటి లోకి వచ్చేస్తున్న శాకిని డాకిని

ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ నవలను మూడు భాగాల సీరీస్ గా ఫ్రాంచైజీ సినిమాగా రూపొందించబడుతుందని తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్‌గా మారే ఈ సువర్ణావకాశాన్ని తమ హీరో కోల్పోయినందుకు సూర్య అభిమానులు దర్శకుడు శంకర్‌ పై పూర్తిగా అపనమ్మకం మరియు కోపంతో ఉన్నారు. ఒక బాలీవుడ్ స్టార్ తమిళ లెజెండ్‌గా నటించడం ఏమిటనే విషయం పై కూడా కొందరు తమిళ ప్రేక్షకులు సంతోషంగా లేరు.

వేల్పారి సినిమా సీరీస్ ను 2023లో ప్రారంభం చేస్తారని అంచనా వేశారు. మరియు బడ్జెట్ లెక్కలకి వస్తే 1000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దర్శకుడు శంకర్ భారీ స్థాయిలో మరియు విలాసవంతమైన విధంగా చిత్రాలను తెరకెక్కిస్తారనే పేరు ఉంది. అందుకే ఈ పీరియాడికల్ డ్రామా వీలైనంత గ్రాండ్‌గా ఉంటుందని బాలీవుడ్ మీడియా పేర్కొంది.

హీరో ఎవరు అనే దాంతో సంబంధం లేకుండా, ఈ పురాణ నవల సినిమాగా రూపాంతరం చెందడం సినీ ప్రేమికులను మరియు చరిత్ర ప్రియులను ఉత్తేజపరుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శంకర్ తొలిసారిగా ఇక హిస్టారికల్ పీరియడ్ డ్రామాను తెరకెక్కిస్తుండటం వలన ఈ ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది అంచనాలను మించి పొన్నియన్ సెల్వన్ లాగా తమిళ సినిమా పరిశ్రమలో భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp

READ  నా పై, నా కుటుంబం పై ట్రోలింగ్ చేయిస్తుంది ఒక ప్రముఖ హీరో : మంచు విష్ణు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories