‘చూసీ చూడంగానే’ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి.. యువతరం ప్రేక్షకులలో చక్కని క్రేజ్ సంపాదించుకున్నారు.. ఇటీవలే “గమనం” వంటి విభిన్న కథా వస్తువు ఉన్న చిత్రంలో నటించి ఆకట్టుకున్నారు. తాజాగా శివ కందుకూరి మరో కొత్త సినిమాతో, “భూతద్దం భాస్కర్ నారాయణ” అనే వెరైటీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అయితే ఈరోజుల్లో ఒక సినిమాని ఎంత బాగా తీసామన్నది కాదు.. ఎంత బాగా ప్రచారం చేసి ప్రేక్షకుల్లో తీసుకు వెళ్ళాము అనేదే ప్రస్తుతం పరిశ్రమలో నడుస్తున్న ట్రెండ్.
పెద్ద సినిమాలు అంటే అందులో స్టార్ హీరోలు, హీరోయిన్లు, గ్రాఫిక్స్ వంటి అదనపు హంగులు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఆ సినిమాల పై ప్రేక్షకులు అసక్తి చూపుతారు.కానీ చిన్న సినిమాలకు అలా కాదు, టైటిల్, ఫస్ట్ లుక్ ఇలా ప్రతి పబ్లిసిటీ అప్డేట్ లోనూ ప్రేక్షకులను తమ వైపు తిప్పుకునేలా చేయడంలోనే విజయ రహస్యం ఉంది.
ఆ పద్ధతిని తూ.చ. తప్పకుండా పాటిస్తూ.. ప్రేక్షకుల్ని సినిమా థియేటర్లకు రప్పించడానికి ఇప్పటి నుంచే వారిని ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుని వారి అభిరుచులు ఎంటో భూతద్ధంలోంచి చూస్తున్నాడు భాస్కర్ నారాయణ.
పురుషోత్తం రాజ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న సినిమా భూతద్దం భాస్కర్ నారాయణ.నిర్మాణ విలువలలో ఎక్కడా ప్రమాణాలు తగ్గకుండా.. మంచి కథను నమ్మి ఆ కథను అంతే అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేసింది “భూతద్ధం భాస్కర్ నారాయణ” చిత్ర యూనిట్.ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని ఈరోజు విడుదల చేశారు.
ఈ చిత్రంలో శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ విషయానికి వస్తే..
శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తి.. మరియు నారదమునితో పాటు ఇంద్రుడు వంటి పురాణాల పాత్రలతో గ్లింప్స్ మొదలవుతుంది. ఆ క్రమంలో.. కలియుగంలో రాక్షసులు భువిపైకి అవతరించబోతున్నారు. అట్టి రాక్షసుల నుంచి కాపాడమని ఆ విష్ణుమూర్తిని వేడుకొంటాడు ఇంద్రుడు. దానికి ఆ నారాయణుడు చింతించకు ఇంద్రదేవా..! కలియుగంబున భువిపైన జనియించి, ఏ ఉపద్రవం తలెత్తకుండా చూసెదనని అభయం ఇస్తున్నానని చెప్పడంతో హీరో శివ కందుకూరి, అదే మన భూతద్ధం భాస్కర్ నారాయణ ఎంట్రీ ఇస్తాడు అన్నమాట.
ఈ గ్లింప్స్ లో హీరో శివ కందుకూరి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మరియు కరెంట్ తో సిగరెట్ వెలిగించుకునే సన్నివేశంలో ఆ యాటిట్యూడ్ కూడా వావ్ అనిపించే విధంగా ఉంది. ఈ గ్లింప్స్ బట్టి సినిమా కథ అంచనా వేయాలని చూస్తే ఇది ఒక పురాణ నేపథ్యంలో జరిగే ఆసక్తికరమైన సినిమాగా కనిపిస్తుంది. గ్రామీణ వాతావరణంలో జరిగే ఒక డిటెక్టివ్ కథగా ఈ సినిమాని తెరకెక్కించారట.
డిటెక్టివ్ అంటే మనకు మూడేళ్ల క్రితం యువ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” చిత్రం గుర్తుకు రాక మానదు. మరి ఆ సినిమాని మరిపించేలా మిగతా సినిమాలేవీ గుర్తుకు రానంత వినూత్నంగాఈ చిత్రాన్ని దర్శకుడు పురుషోత్తం రాజ్ తెరకెక్కించారు అని తెలుస్తోంది.
ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ను క్రమ పద్ధతిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.