కమల్ హాసన్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కొన్నేళ్ల క్రితం రూపొందిన భారతీయుడు మూవీ అప్పట్లో అతి పెద్ద సంచలన విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల దానికి సీక్వెల్ అయిన భారతీయుడు 2 ని థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చారు. ఈమూవీలో సేనాపతి పాత్రలో మరొకసారి తన అద్భుత పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు కమల్
సిద్దార్ధ, ఎస్ జె సూర్య, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈమూవీ అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచి బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. కాగా దీనికి సీక్వెల్ గా ప్రస్తుతం భారతీయుడు 3 మూవీ గ్రాండ్ గా లెవెల్లో రూపొందుతోంది. ఈ మూవీలో ఎస్ జె సూర్య తో పాటు బాబీ సింహా, కాజల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అయితే ఈ మూవీని మాత్రం థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటిటిలోనే ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈమూవీ జనవరిలో ఓటిటిలో రిలీజ్ కానుంది. మరి భారతీయుడు పార్ట్ 2 డిజాస్టర్ గా నిలిచిన దాని సీక్వెల్ అయిన పార్ట్ 3 ఎంతమేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.