లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ భారతీయుడు 2. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి సంచలన విషయం సొంతం చేసుకున్న భారతీయుడు కి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీని రెడ్ జెయింట్ మూవీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా సిద్దార్ధ, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య తదితరులు కీలక పాత్రలు చేశారు.
రాక్ స్టార్ అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీ ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇందులో సేనాపతిగా మరొక్కసారి కమల్ తన అద్భుత పెర్ఫార్మన్స్ తో అదరగొట్టినప్పటికీ ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలు ఈ మూవీకి పరాజయాన్ని అందించాయి.
ఇప్పటికే ఆల్మోస్ట్ థియేటర్స్ లో ఫుల్ రన్ పూర్తి చేసుకున్న భారతీయుడు 2 మూవీ యొక్క ఒటిటి రిలీజ్ డేట్ ని నేడు అనౌన్స్ చేసారు. ఈ మూవీ యొక్క ఓటిటి హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ వారు దీనిని ఆగష్టు 9న తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో తమ ఆడియన్స్ కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించారు. మరి థియేటర్స్ లో ఏమాత్రం ఆకట్టుకోని ఈ మూవీ ఎంతర మేర ఓటిటి ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి.