Homeబాక్సాఫీస్ వార్తలుBharateeyudu 2 First Day Collection 'భారతీయుడు - 2' ఫస్ట్ డే కలెక్షన్ డీటెయిల్స్

Bharateeyudu 2 First Day Collection ‘భారతీయుడు – 2’ ఫస్ట్ డే కలెక్షన్ డీటెయిల్స్

- Advertisement -

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ భారతీయుడు 2. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పాన్ ఇండియన్ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా కీలక పాత్రల్లో ఎస్ జె సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్ధ, సముద్రఖని, బాబీ సింహా తదితరులు నటించారు.

మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నిన్న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. అయితే ఆ అంచనాలు అందుకోవడంలో విఫలం అయిన ఈ మూవీ నెగటివ్ టాక్ ని మూటగట్టుకుంది. ఇక మరోవైపు ఓపెనింగ్స్ పరంగా భారతీయుడు 2 బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక మనం ప్రస్తుతం ఈ మూవీ యొక్క ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల కలెక్షన్ డీటెయిల్స్ తెలుసుకుందాం.

నైజాం – రూ. 2.5 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 0.7 కోట్లు

ఈస్ట్ – రూ. 0.43 కోట్లు

READ  Kalki 2898 AD First Week Collections: 'కల్కి 2898 ఏడి' ఫస్ట్ వీక్ తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ షేర్ డీటెయిల్స్

గుంటూరు – రూ. 0.55 కోట్లు

కృష్ణా – రూ. 0.38 కోట్లు

వెస్ట్ – రూ. 0.26 కోట్లు

నెల్లూరు – రూ. 0.2 కోట్లు

సీడెడ్ – రూ. 0.8 కోట్లు

టోటల్ షేర్ – రూ. 5.8 కోట్లు

GST తో కలిపి షేర్ – రూ. 6.7 కోట్లు

థియేట్రికల్ బిజినెస్ రూ. 25 కోట్లు, రికవరీ 27 %

ఇక తమిళ్ లో కూడా భారతీయుడు 2 బాగానే ఓపెనింగ్ కలెక్షన్ రాబట్టగా, అటు హిందీలో మాత్రం ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ అందుకోలేకపోయింది. అయితే ట్రేడ్ అనలిస్టులు చెప్తున్న వివరాల ప్రకారం ఈ మూవీ మొత్తంగా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 60 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్లు తెలుస్తోంది. మరి నెగటివ్ టాక్ మరియు రివ్యూస్, రేటింగ్స్ తో రాబోయే రోజుల్లో భారతీయుడు 2 మూవీ ఎంతమేర కలెక్షన్ రాబడుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  Director Shankar Next Projects: నెక్స్ట్ ప్రాజక్ట్స్ అనౌన్స్ చేసిన డైరెక్టర్ శంకర్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories