HomeMovie Newsభారీ ధరకు అమ్ముడైన 'భైరవం' నాన్ థియేట్రికల్ రైట్స్

భారీ ధరకు అమ్ముడైన ‘భైరవం’ నాన్ థియేట్రికల్ రైట్స్

- Advertisement -

ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్నటువంటి యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ గరుడన్. కాగా ఈ సినిమాకి తాజాగా తెలుగు రీమేక్ గా తెరకెక్కింది భైరవం. ఈ సినిమాలో యువ నటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధ మోహన్ గ్రాండ్ లెవెల్ లో రూ. 45 కోట్లతో నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి ప్రచార చిత్రాలన్నీ కూడా అందరిని ఆకట్టుకుని సినిమాపై బాగానే అంచనాలు అయితే ఏర్పరిచాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ప్రకారం నాన్ థియెట్రికల్ రైట్స్ భారీ స్థాయిలో జరిగిందని తాజాగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. ఓవరాల్ గా ఈ సినిమాకి నాన్ థియేటర్ రైట్స్ రూ. 30 కోట్లకు సేల్స్ జరుగగా తప్పకుండా ఇది రిలీజ్ అనంతరం బాగా రాబడుతుందని హీరోలతో పాటు టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

అయితే బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ మాద్యమంలో వందల మిలియన్స్ తో పాటు టీవీల్లో మంచి రేటింగ్స్ అందుకోవడంతో అది ఈ సినిమా బిజినెస్ కి కొంత ప్లస్ అయిందని తెలుస్తోంది.

See also  'భైరవం' ఈవెంట్ లో ఎమోషనల్ అయిన మంచు మనోజ్ 

మంచి పాజిటివ్ టాక్ కనుక వస్తే భైరవం సినిమా భారీ కలెక్షన్ అందుకునే అవకాశం ఉంటుంది. దివ్య పిళ్ళై, అదితిశంకర్, ఆనంది హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా మే 30న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది. మరి ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories