ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ఎల్లుండి గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించగా సుకుమార్ తెరకెక్కించారు. ఇప్పటికే అందరిలో భారీ అంచనాలు కలిగిన పుష్ప 2 మూవీ ఆరు భాషల్లో రిలీజ్ కానుంది.
మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్స్ ఇప్పటికే చాలా చోట్ల అదరగొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా యొక్క టికెట్స్ 10,000 మందికి ఫ్రీగా ఇవ్వటానికి ఒక బెట్టింగ్ యాప్ అయితే ముందుకు వచ్చింది. ప్రముఖ సౌతాఫ్రిన్ క్రికెటర్ ఏబి డివిలియర్స్ తో ఉల్ఫ్ పే అనే బెట్టింగ్ యాప్ వారు ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నారు. దాని ప్రకారం ఆ యాప్ లో మొదట 100 రూపాయలు డిపాజిట్ చేసిన పదివేల మందికి పుష్ప 2 టికెట్స్ ని ఫ్రీగా ఇవ్వనున్నారు.
ఏ బి డివిలియర్స్ దీనికి సంబంధించి తన ట్విట్టర్ ప్రొఫైల్లో ఆ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ పుష్ప ఫ్రీ టికెట్స్ కి సంబంధించి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. దీనితో మూవీ పై క్రేజ్ మరింతగా పెరగడంతో పాటు ఇది ఒకరకంగా సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళింది అని చెప్పాలి. మరి అందరిలో ఈ స్థాయి క్రేజ్ ఏర్పరిచిన పుష్ప2 మూవీ రిలీజ్ అనంతరం ఎంత మేర సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.