Homeసినిమా వార్తలు'ఛత్రపతి' రీమేక్ ఫ్లాప్ పై బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘ఛత్రపతి’ రీమేక్ ఫ్లాప్ పై బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ కొన్నేళ్ళ క్రితం సమంత హీరోయిన్ గా వివి వినాయక తెరకెక్కించిన అల్లుడు శీను సినిమా ద్వారా టాలీవుడ్ కి నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా అప్పట్లో బాగా విజయం అందుకుని బెల్లంకొండ శ్రీనివాస్ కి మంచి పేరు తీసుకొచ్చింది.

అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాల్లో బోయపాటి శ్రీను తీసిన జయ జానకి నాయక కూడా బాగా ఆడింది అనంతరం పలు సినిమా అవకాశాలు అందుకున్నప్పటికీ మధ్యలో రాక్షసుడు తప్ప మిగతావేవి ఆయనకి పెద్ద సక్సెస్ అందించలేదు. ఇటీవల హిందీలో వినాయక్ తీసిన చత్రపతి రీమేక్ ద్వారా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీను.

అయితే ఆ సినిమా భారీ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచింది. ఇక తాజాగా భైరవం ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో భాగంగా ఆ సినిమా గురించి బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమౌళి గారికి అన్ని భాషలు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉందని అన్నారు. ఇక సౌత్ లో ఆయన ప్రభాస్ తో తీసిన చత్రపతి హిందీలో రీమేక్ చేస్తే వర్కౌట్ అవుతుందని తనకనిపించింది అన్నారు.

READ  SSMB 29 రిలీజ్ డేట్ లాక్ ?

గతంలో రానా, రాంచరణ్ వంటి వారు బాలీవుడ్లో సినిమాలు చేశారు అయితే రామ్ చరణ్ చేసిన జంజీర్ డైరెక్ట్ హిందీ రీమేక్ కాబట్టి వర్కౌట్ కాలేదన్నారు. కాగా తమ సినిమా బాగానే వర్కౌట్ అవుతుందని తమ టీమ్ భావించినట్టు చెప్పుకొచ్చారు. వీవీ వినాయక తో పాటు అందరం చత్రపతి మూవీ కోసం ఎంతో కష్టపడ్డప్పటికీ ఓవరాల్ గా అది భారీ డిజాస్టర్ గా నిలవడం ఒకింత బాధనిపించిందన్నారు.

ముఖ్యంగా కోవిడ్ తర్వాత సినిమాల పై ప్రేక్షకాభిమానుల యొక్క టేస్ట్ మారిందని ఇప్పుడు పూర్తిగా విభిన్నమైన ఆకట్టుకునే కథ కథనాలతో తెరకెక్కిస్తేనే ఆడియన్స్ చూస్తున్నారని అన్నారు.అందుకే ఇకపై తన నుంచి మూడు నెలలకు ఒక సినిమా వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. 

Follow on Google News Follow on Whatsapp

READ  'ది రాజాసాబ్' టీజర్ : అంతా ఆయన చేతుల్లోనే ?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories