నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ అభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే. పవర్ స్టార్ పై తనకున్న అభిమానాన్ని ఆయన ఎన్నో వేదికల పై, వివిధ కార్యక్రమాల్లో ఎంతో దూకుడుగా వ్యక్తపరిచారు కూడా.
అయితే ఇటీవల ఆహా వీడియోలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్.. ఆ ఎపిసోడ్ లో గబ్బర్ సింగ్ సినిమాకు తాను కొంత రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నానని చెప్పడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
గబ్బర్ సింగ్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తన రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని మాత్రమే అందుకున్నానని, అసలు తాను అడిగినది మాత్రం అందుకోలేదని వెల్లడించారు. ఆ సినిమా అంత ఘనవిజయం సాధించినా, నిర్మాత బండ్ల గణేష్ తను ‘దేవుడు’గా పిలిచే పవన్ కళ్యాణ్ కు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు.. తమ అభిమాన హీరోకి బండ్ల గణేష్ తగినంత రెమ్యునరేషన్ ఇవ్వలేదని ట్విట్టర్ లో మండిపడ్డారు. ఇప్పుడు బండ్ల గణేష్ ఆ దాడికి కౌంటర్ ఇవ్వడం ప్రారంభించి, వివరణాత్మక వివరణతో పాటు ఖచ్చితంగా దూకుడుగా బదులు ఇస్తానని సంకేతాలు ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రెమ్యునరేషన్ గురించి ఎందుకు అలా అన్నారు, దానికి బండ్ల గణేష్ స్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పరమేశ్వర సినీ క్రియేషన్స్ పతాకం పై బండ్ల గణేష్ నిర్మించిన గబ్బర్ సింగ్ చిత్రం ఆయన కెరీర్ లోనే కాదు పవన్, దర్శకుడు హరీష్ శంకర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ గా నిలిచింది.