బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ సీజన్ 1 కంటెంట్ కు భారీ ప్రశంసలు లభించడంతో పాటు బాలకృష్ణకు కొత్త ఇమేజ్ రావడానికి కూడా ఆ కార్యక్రమం దోహదపడింది. అలాగే మొదటి సీజన్ లో అతిథులతో బాలయ్య సరదాగా సాగించిన సంభాషణలు.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి అడిగిన ప్రశ్నలతో ఎంటర్టైన్మెంట్ అందించడం పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు.
అయితే సీజన్ 2కు మాత్రం ఓపెనింగ్ ఎపిసోడ్ నుంచే ఒక ప్రణాళికా భద్దంగా రాజకీయాల గురించే దృష్టి సారించడం వల్ల విరుద్ధమైన స్పందన తెచ్చుకుంది. తమ పార్టీ గురించి గొప్పలు చెప్పడం.. ప్రతిపక్ష పార్టీ పై కౌంటర్లు ఇవ్వడం మీదనే దృష్టి పెట్టడం ప్రేక్షకులకు అంతగా రుచించలేదు.
రెండో సీజన్ ను చంద్రబాబు నాయుడు, లోకేశ్ లతో మొదలు పెట్టి వివాదాస్పద రాజకీయ ప్రశ్నలతో సీబీఎన్ సరదా కోణాన్ని కవర్ చేశారు. ఈ షోను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని, అందువల్లే దీనికి నెగిటివ్ ఇమేజ్ వచ్చిందని పలువురు భావించారు. మూడో ఎపిసోడ్ లో మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ కి కూడా చాలా డల్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్న తాజా ఎపిసోడ్ లో కూడా బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరలేదని పవన్ ను అడగడం ద్వారా రాజకీయ కోణాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ షోకు పవన్ కళ్యాణ్ అతిథిగా వస్తాడని తెలియగానే అభిమానులు, నెటిజన్లు చాలా ఎగ్జైట్ అయ్యారు.
కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన రెండు ఎపిసోడ్స్ లో కూడా ఆశించిన ఎంటర్టైన్మెంట్ లేకుండా బోర్ కొట్టించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. పవన్ మాట్లాడటానికి చాలా అసౌకర్యంగా అనిపించడంతో బాలకృష్ణ ఎక్కువగా మాట్లాడాల్సి వచ్చింది. తద్వారా షోకి రాజకీయ రంగు పులుముకుంది