Homeసినిమా వార్తలుసమ్మర్ 2023కు వాయిదా పడ్డ బాలకృష్ణ సినిమా NBK107 విడుదల ?

సమ్మర్ 2023కు వాయిదా పడ్డ బాలకృష్ణ సినిమా NBK107 విడుదల ?

- Advertisement -

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న NBK 107 ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి. అఖండ సినిమా ఘనవిజయంతో బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లోనే అత్యుత్తమ దశలో ఉన్నారు. అదే విధంగా, గోపీచంద్ మలినేని కూడా ఇటీవలే మాస్ మహారాజా రవితేజతో క్రాక్‌ వంటి సూపర్ హిట్ ను అందించి మంచి ఊపు మీద ఉన్నారు. ఈ రెండు సినిమాలు 2021లో విడుదలయ్యాయి. కాగా NBK107 పై అంచనాలను భారీగా పెంచేశాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల తేదీని సరిగా నిర్ణయించడంలో వారు ప్రస్తుతం ఇబ్బందులని ఎదుర్కొంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో చిరు154 ఒకటి కాగా మరో సినిమా NBK107. చిరంజీవి – బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాను ఇదివరకే 2023 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే బాలకృష్ణ కూడా తన చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని భావించారట. ఈ పోటీ ఇరు హీరోల అభిమానులకు ఆనందాన్ని ఇచ్చేదే, ఎందుకంటే ఎప్పటి నుంచో మెగా – నందమూరి హీరోలు మరియు అభిమానుల మధ్య ఉన్న వృత్తి పరమైన పోరు తెలిసిందే కదా. అయితే ఈ రెండు సినిమాలని ఒకేసారి విడుదల చేస్తే ఖచ్చితంగా ఒకరీ లాభాలను మరొకరు తగ్గించే అవకాశం ఎంతైనా ఉంది.

READ  బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి రోజా

అందుకే NBK107 సినిమాని సమ్మర్ 2023కి వాయిదా వేయాలని మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తున్నారట. ఈ విషయమై బాలయ్యను ఒప్పించాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కాగా మైత్రీ వారు డిసెంబర్ 23 లేదా వేసవి ప్రారంభంలో (మార్చి 2023) సినిమాని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

అయితే, డిసెంబర్ 23 తేదీన హాలీవుడ్ నుండి అత్యంత భారీ ప్రతిష్ఠాత్మక సినిమా అయిన అవతార్ 2 విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అందువల్ల అదే తేదీకి బాలకృష్ణ సినిమాని విడుదల చేయడం అంత సబబు కాదనే వాదన బలంగా వినిపిస్తుంది. ఈ వాదనలో ఖచ్చితంగా నిజం ఉంది.

అంత భారీ సినిమాతో పోటీ పడే కంటే.. కుదిరితే సంక్రాంతికి లేదా మార్చిలో సినిమాని విడుదల చేయడమే మంచిదనే భావనలో మైత్రీ మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి చివరికి ఏ తేదీని నిర్ణయిస్తారో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  20 ఏళ్ళ తరువాత మళ్ళీ విడుదలవుతున్న బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories