Homeసినిమా వార్తలువెంకటేష్ మహాతో సినిమా చేయనున్న బాలకృష్ణ

వెంకటేష్ మహాతో సినిమా చేయనున్న బాలకృష్ణ

- Advertisement -

సినిమా పరిశ్రమలో ఒక్కోసారి కొన్ని ఆశ్చర్యకరమైన, కొన్ని మన ఊహలలో కూడా ఊహించని హీరో – దర్శకుల కాంబినేషన్లు సెట్ అవుతూ ఉంటాయి. అలాంటి కాంబినేషన్ ఒకటి ప్రస్తుతం చర్చల్లో ఉంది. అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలకృష్ణ హాజరైనప్పటి నుంచి బాలయ్య ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల పై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్‌లో ఈ నందమూరి హీరో కోసం స్క్రిప్ట్‌ను నేరేట్ చేయబోతున్నట్లు దర్శకుడు పరశురామ్ బహిరంగంగా ప్రకటించాతు. ఈ చిత్రం ప్రస్తుతం చర్చల దశలో ఉంది. మరియు అనిల్ రావిపూడితో సినిమా అయినా తర్వాత బాలయ్య చేయబోయే చిత్రం ఇదే కావచ్చు అని అందరూ భావిస్తున్నారు.

అయితే మరో యువ దర్శకుడు కూడా బాలయ్యను డైరెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు అని తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు C/O కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా. కేవలం రెండు సినిమాలు చేసినా.. బలమైన పాత్రలతో మానవీయ మరియు వాస్తవిక సన్నివేశాలను రూపొందించడంలో ప్రసిద్ది చెందారు.

READ  సూర్యకు షాక్ ఇచ్చిన శంకర్.. భారీ ప్యాన్ ఇండియా సినిమాకు బాలీవుడ్ హీరోతో జోడీ

పరశురామ్ కథ కంటే వెంకటేష్ మహా స్క్రిప్ట్ చూసి బాలయ్య ఇంప్రెస్ అయ్యారని సన్నిహితులు పేర్కొంటున్నారు. అందుకే బాలయ్య ఫేవరెట్ ప్రొడ్యూసర్ వారాహి ప్రొడక్షన్స్‌లో వెంకటేష్ మహాతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్యానర్ ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో లెజెండ్‌ సినిమాని రూపొందించింది.

బాలయ్య ఎక్కువగా మాస్ దర్శకులతోనే పని చేస్తారనే పేరున్న నేపథ్యంలో ఈ క్రేజీ కాంబినేషన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే వెంకటేష్ మహా దర్శకత్వంలో బాలకృష్ణ నటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బాలయ్య గతంలో సింగీతం శ్రీనివాస్, బాపు వంటి విభిన్న దర్శకులతో వైవిధ్యమైన సినిమాలు చేసినా.. ఈ రోజుల్లో కేవలం మాస్ దర్శకులతోనే పనిచేస్తున్నారు. అందువల్ల తాజాగా వినిపిస్తున్న ఈ అరుదైన కలయిక వర్కవుట్ అవుతుందని, మరియు బాలకృష్ణ – వెంకటేష్ మహా ఇద్దరి నుండి ఉత్తమమైన పనితనం తీసుకురావాలని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp

READ  అర్జున్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పై స్పందించిన విశ్వక్ సేన్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories