Homeసినిమా వార్తలుటాలీవుడ్ రీ-రిలీజ్ ల పరంపరలో బాలయ్య సమరసింహారెడ్డి

టాలీవుడ్ రీ-రిలీజ్ ల పరంపరలో బాలయ్య సమరసింహారెడ్డి

- Advertisement -

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ తర్వాత తన అభిమానులకు పాత సూపర్ హిట్ చిత్రాలను ఆనందించే అవకాశం నందమూరి బాలకృష్ణ ఇస్తున్నారు. బాలకృష్ణ కెరీర్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయిన సమరసింహా రెడ్డి సినిమా త్వరలో రీ-రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రస్తుతం దీన్ని 4K టెక్నాలజీలో మార్చే సన్నాహాలు చేస్తున్నారు.

సమరసింహా రెడ్డి బాలకృష్ణ కెరీర్ లో అత్యంత పేరు తెచ్చుకున్న, బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలలో ఒకటి. కేవలం ఆయన అభిమానులకే కాకుండా సాధారణ సినీ ప్రేమికులను కూడా ఎంతగానో అలరించింది. ప్రేక్షకుల చేత ఈలలు వేయించే యాక్షన్ సన్నివేశాలు, ఉర్రూతలూగించే పాటలతో పాటుగా మాస్ ఎలివేషన్‌ సన్నివేశాలు ఇప్పటికీ అందరికీ నచ్చుతాయి.

1999 సంవత్సరంలో సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాలయ్యను మాస్ ప్రేక్షకుల దృష్టిలో ఒక డెమిగాడ్ గా నిలబెట్టడంలో పెద్ద పాత్ర పోషించిందని చెప్పాలి. నీ ఇంటికొచ్చా.. నీ నట్టింటికొచ్చా అని విలన్ ఇంటికి వెళ్ళి బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ ఇప్పటికీ సినీ ప్రేమికులను, మరియు నందమూరి అభిమానులను అలరిస్తాయి. నేను తొడ గొడితే ఆ సౌండ్ కే నువ్వు చస్తావు అనే సన్నివేశం కూడా ఇప్పటికీ ప్రేక్షకులు టివి, యూట్యూబ్ లలో మళ్ళీ మళ్ళీ చూసి ఆనందిస్తుంటారు.

READ  ఎన్టీఆర్ 30 పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టిన కళ్యాణ్ రామ్

సమరసింహా రెడ్డి సినిమాలో అంజల జవేరి మరియు సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా ఈ మాస్ బ్లాక్‌బస్టర్‌కు బి గోపాల్ దర్శకత్వం వహించారు. వి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా, మణిశర్మ ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు అద్భుతమైన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

ఈ చిత్రం రీ-రిలీజ్‌ ను ఈ ఏడాది చివర్లో లేదా 2023 ప్రారంభంలో చేయనున్నారు. ఇదిలా ఉండగా, బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తన తదుపరి చిత్రం NBK107తో బిజీగా ఉన్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఓవర్సీస్ షెడ్యూల్ లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో క్రిస్మస్ సీజన్ లో విడుదల చేసేందుకు చిత్ర బృందం అన్ని సన్నాహాలు చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  తెలుగు సినిమా నిర్మాతల గిల్డ్ కొత్త నిభందనలు అమలు అవుతాయా?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories