తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే అఖండ కాంబినేషన్ ఇప్పుడు ఒక ప్రకటన కోసం మరోసారి చేతులు కలిపింది. అయితే అది దర్శకుడు బోయపాటి శ్రీను మరియు బాలయ్య కాంబో కాదు, వారిరువురి కలయికలో వచ్చిన అఖండ సినిమాలో బాలకృష్ణతో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్ మళ్ళీ ఆయనతో ఒక యాడ్ కోసం జోడీ కట్టనున్నారు.
నందమూరి బాలకృష్ణ ఇటీవలే తన కెరీర్‌లో మొదటి సారిగా ఒక బ్రాండ్ తో చేతులు యాడ్ లో నటించారు. సాయి ప్రియా కన్‌స్ట్రక్షన్స్ కోసం ఆయన రెండు యాడ్ కమర్షియల్‌లు కూడా చేసారు. ఇప్పుడు ఆయన వేగా జ్యువెలర్స్ మరియు వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్‌ని ఎండార్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి గత వారం ఒక అధికారిక ప్రకటన వెలువడింది.
నివేదికల ప్రకారం, విజయవాడకు చెందిన ఈ జ్యువెలరీ గ్రూప్ కోసం ఒక ప్రకటన మూడు రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించబడింది. అఖండలో బాలయ్య సరసన కథానాయికగా నటించిన ప్రగ్యా జైస్వాల్ కూడా యాడ్‌లో భాగం కానున్నారు. బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ వధూవరులుగా ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా ఈ నగల వాణిజ్య ప్రకటన త్వరలో టెలివిజన్‌లో ప్రదర్శించబడుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం NBK 108 కోసం అనిల్ రావిపూడితో కలిసి పని చేస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. బాలయ్య కుమార్తెగా యువ నటి శ్రీలీల కనిపించనున్నారు. ఇక బోయపాటి శ్రీనుతో బాలయ్య తదుపరి చిత్రం కూడా దాదాపుగా ధృవీకరించబడింది మరియు అదే కాంబోలో లెజెండ్ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ కొత్త ప్రాజెక్ట్‌కు కూడా మద్దతు ఇస్తుంది.