Homeసినిమా వార్తలుBalakrishna: సౌత్ ఇండియన్ పొంగల్ 2023 సినిమాలలో బాలకృష్ణ ఏ టాప్ పెర్ఫార్మర్

Balakrishna: సౌత్ ఇండియన్ పొంగల్ 2023 సినిమాలలో బాలకృష్ణ ఏ టాప్ పెర్ఫార్మర్

- Advertisement -

ఈ సంక్రాంతి/పొంగల్ కి విడుదలైన 4 తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. తెలుగులో వాల్తేరు వీరయ్య విజేతగా నిలవగా, తమిళంలో వారిసు అదే ఘనతను నమోదు చేసింది. అయితే పెర్ఫార్మెన్స్ పరంగా పరిశీలిస్తే బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ , స్వాగ్ , పెర్ఫార్మెన్స్ కు సాటి ఎవరూ రాలేదనే చెప్పాలి.

వీరసింహారెడ్డి పాత్రలో మెస్మరైజ్ చేసిన ఆయనకు ఇది కెరీర్ బెస్ట్ మేకోవర్ అని చెప్పొచ్చు. కేవలం ఆయన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ మాత్రమే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాణించడానికి ప్రధాన కారణంగా నిలిచి కథలోని ఇతర లోపాలన్నింటినీ కవర్ చేసింది.

మిగతా మూడు సినిమాల్లో హీరోలు కూడా తమ వంతు కృషి చేసినా.. బాలకృష్ణ మాత్రం సాటిలేని స్వాగ్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో ఈ సంక్రాంతికి అందరినీ డామినేట్ చేశారు.

వీరసింహారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం 56 కోట్ల షేర్ వసూలు చేసింది. సెకండ్ వీకెండ్ నాటికి ఈ సినిమా బ్రేక్ వెన్ మార్క్ ను అందుకోవడానికి సిద్ధం అవుతోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ 74.7 కోట్లు కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తొలి వారంలో 65.04 కోట్లు వసూలు చేసింది.

అఖండ నుంచి బాలకృష్ణ తన కెరీర్ బెస్ట్ ఫేజ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఆయన బాక్సాఫీస్ స్టామినా కాస్త నిలకడగా లేకపోయినా ఆ ఒక్క సినిమా మాత్రం అన్నీ మార్చేసింది. ఇప్పుడు ఆయన నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి కలెక్షన్లే దీనికి పెద్ద నిదర్శనం,మిక్స్ డ్ టాక్ తో వచ్చిన ఈ సినిమాని తన స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ తో నిలబెట్టిన బాలకృష్ణ.. తన కెరీర్ బెస్ట్ కలెక్షన్లు నమోదయ్యేలా చేశారు.

READ  Sankranti-2023: 2023 సంక్రాంతికి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయిన దర్శకులు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories