సినిమా: బలగం
రేటింగ్: 2.75/5
తారాగణం: ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, వేణు, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచ్చ రవి తదితరులు.
దర్శకత్వం: వేణు
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి
విడుదల తేదీ: 3 మార్చి 2023
పల్లెటూరి నేపథ్యంలో సాగే ‘బలగం’ చిత్రంతో కమెడియన్ వేణు దర్శకుడిగా మారారు. సమాజంలో జరిగే తగాదాలు, నాటకీయ మరియు ఆచార వ్యవహారాలు పరిస్థితులను, జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే వాస్తవిక చిత్రణతో ఈ చిత్రం తెరకెక్కింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా చూద్దాం.
కథ : సాయిలు (ప్రియదర్శి) అనే యువకుడు అనేక వ్యాపార ప్రయత్నాలు చేసి విజయం సాధించలేక పోతుంటాడు. అయితే కట్నం కోసం పెళ్లి చేసుకుని ఆ డబ్బును తన వ్యాపారానికి ఉపయోగించాలని ప్లాన్ చేస్తాడు. కానీ తాత కొమురయ్య చనిపోవడంతో అతనికి పెద్ద సమస్య వచ్చి పడుతుంది. తద్వారా నిశ్చితార్థం రద్దుకు దారి తీస్తుంది. ఆ పైన తన ఇంట్లోనే ఎల్లప్పుడూ కుమ్ములాటకు సిద్ధంగా ఉండే రెండు కుటుంబాలను ఒకటి చేయడానికి సాయిలు ఏం చేస్తాడు, అతని పథకాలు ఏంటి అనేదే మిగతా కథ.
నటీనటులు : ప్రియదర్శి సినిమాను పూర్తిగా తన భుజస్కంధాల పై నడిపించి ఈ డార్క్ కామెడీ సినిమాలో సాయిలు అనే బాధ్యత లేని యువకుడిగా అద్భుతంగా నటించారు. హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ చక్కగా నటించి తన పని తాను చేసుకుపోయారు. సహాయ తారాగణంలో మురళీధర్ గౌడ్, రూప, జయరామ్ అద్భుతమైన నటన కనబరిచారు. వేణు, రచ్చ రవి కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించి కామెడీ సీన్స్ లో బాగా నటించారు.
విశ్లేషణ: దిల్ రాజు లాంటి నిర్మాత నుంచి ఎవరూ ఊహించనటువంటి విలక్షణమైన సినిమా ‘బలగం’. కామెడీ, డ్రామా, సోషల్ కామెంటరీ ఇలా రకరకాల షేడ్స్ ఉన్న చిత్రమిది. అంతే కాకుండా మానవ ప్రవర్తన పై లోతైన దృక్పథాన్ని కూడా అందిస్తుంది మరియు దర్శకుడిగా ఇలాంటి సబ్జెక్టును ఎంచుకున్నందుకు క్రెడిట్ వేణుకు దక్కాలి. నేటివిటీ సినిమాకు అతి పెద్ద బలం కానీ సినిమాలో కథనం వేగం పుంజుకోవడానికి తనదైన సమయం తీసుకుంటుంది. ఫస్ట్ హాఫ్ ని ఇంకాస్త స్ఫుటమైన కథనంతో నడిపించి ఉంటే సినిమా మరింత ప్రభావాన్ని చూపించి ఉండేది
ప్లస్ పాయింట్స్:
- ప్రియదర్శి
- కామెడీ
- సరికొత్త కథ
- సహాయక నటీనటులు
మైనస్ పాయింట్స్:
- ఫస్ట్ హాఫ్ కథనం
- కూర్పు
- పునరావృతమయ్యే సన్నివేశాలు
తీర్పు:
ఈ మధ్య కాలంలో ఒక నూతన దర్శకుడు చేసిన విలక్షణమైన ప్రయత్నమే బలగం. వేణుతో పాటు దిల్ రాజు కూడా ఈ ప్రాజెక్టుకు సపోర్ట్ చేసి ఈ సినిమాకి కావాల్సిన కాన్వాస్ అందించినందుకు ప్రశంసలు అందుకోవాలి. ప్రేక్షకులలో చాలా మందిని ఆకట్టుకునేంత కంటెంట్ ఈ సినిమాలో ఉంది మరియు మీరు థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా, ఇందులోని పాత్రలు, సన్నివేశాలు ఖచ్చితంగా మీతో పాటే ఉంటాయి.