Homeసినిమా వార్తలువరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగ చైతన్య

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగ చైతన్య

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో గెలుపోటములు అనేవి సర్వ సాధారణం. ఎందుకంటే సినిమా పరిశ్రమ అనేది గ్యారంటీ లేని పరిశ్రమ కాబట్టి. రాత్రికి రాత్రి సూపర్ స్టార్ లు గా మారిన వారే ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన సందర్బాలు కూడా ఉంటాయి. ఆ ప్రభావం ఖచ్చితంగా అయా నటుల కెరీర్ పై పడుతుంది. అనుకోకుండా సూపర్ హిట్ లు దక్కినట్లే.. ఎదురు చూడని పరాభవాలు ఎదురవుతుంటాయి.

ఇప్పుడు అలాంటి పరిస్థితే అక్కినేని నాగ చైతన్యకు ఎదురవుతుంది. ఇటీవలే నాగ చైతన్య నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ లుగా నిలవడంతో ప్రస్తుతం ఆయన తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ గత రెండేళ్లుగా ఆయన నటించిన మజిలీ, వెంకీ మామ మరియు లవ్ స్టోరీ వంటి సినిమాలు వరుసగా విజయాలు సాధించాయి. టైర్ 2 హీరోల లిస్ట్ లో అగ్రస్థానం ఒక చైతన్యదేనని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అలా నాగ చైతన్యకు అన్నీ సరిగ్గా జరుగుతున్న సమయంలో, ఇప్పుడు వరుసగా రెండు భారీ ఫ్లాప్ లతో మళ్ళీ రేసులో వెనక్కి తగ్గినట్టు అయింది.

లవ్ స్టోరీ చిత్రం నటుడిగా చైతన్యకి ఎంతగా పేరు తెచ్చిందో, బాక్స్ ఆఫీస్ వద్ద అంతే చక్కగా కలెక్షన్లు సాధించింది. అయితే అలాంటి విజయం తర్వాత వచ్చిన థాంక్యూ సినిమా మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా చాలా ఏరియాలలో తక్కువ వసూళ్లు చేసిన ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. అదే కాకుండా అమీర్ ఖాన్ నటించిన తర్వాత లాల్ సింగ్ చద్దా చిత్రంలో నాగ చైతన్య ఒక ముఖ్య అతిధి పాత్రలో నటించగా అది కూడా అతి పెద్ద డిజాస్టర్ వైపు పరుగులు తీస్తుంది.

READ  Vijay Devarakonda: లైగర్ రిలీజ్ తో ఇండియా షేక్ అవుతుందన్న విజయ్

థాంక్యూ లాంటి డిజాస్టర్ తర్వాత, లాల్ సింగ్ చడ్డా కూడా అంతే ఘోరంగా విఫలమవడంతో, నాగ చైతన్యకు వరుసగా రెండు డిజాస్టర్లు వచ్చి పడ్డాయి.ఐతే ఇక్కడ సమస్య సినిమాలు డిజాస్టర్ అవడం కాదు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే సినిమా బాగో లేకపోతే ఏమీ చేయలేడు. కానీ నాగ చైతన్య నటించిన రెండు సినిమాలు కూడా కనీస స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్య.

దానర్థం నాగ చైతన్య సినిమా అంటే ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించడం లేదని అర్థం అవుతుంది. ఈ వరుస పరాజయాల నుండి కోలుకోవాలంటే నాగ చైతన్య ఖచ్చితంగా ఒక భారీ విజయాన్ని అందిస్తేనే వీలు పడుతుంది.నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న దూత అనే వెబ్ సిరీస్ లో కనిపించనున్నారు, ఆ తర్వాత తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఒక ద్విభాషా చిత్రంలో నటించనున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  నెట్ ఫ్లిక్స్ తో రాజమౌళి భారీ ఒప్పందం: ఓటీటీ లో ప్రవేశించనున్న దర్శకధీర?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories