Homeసినిమా వార్తలుభారతీయ సినిమా చరిత్రను మార్చేసిన సినిమా బాహుబలి - రాజమౌళి

భారతీయ సినిమా చరిత్రను మార్చేసిన సినిమా బాహుబలి – రాజమౌళి

- Advertisement -

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతూనే ఉంది. ఆ సినిమాకి అంత పెద్ద హిట్ అవుతుందని, అంతర్జాతీయంగా ఈ స్థాయిలో గుర్తింపు వస్తుందని అనుకోలేదని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఆయన తెరకెక్కించిన భారీ చిత్రాలైన ఆర్ ఆర్ ఆర్, బాహుబలి వంటి సినిమాలకు సంభందించిన విషయాలను ఆయన ఇటీవలె జరిగిన టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో వెల్లడించారు.

ఆర్ఆర్ఆర్ సినిమా కథ చేస్తున్నప్పుడు ఈ సినిమా ఇతర రాష్ట్రాల వారికి బాగా నచ్చుతుందనే నమ్మకం అంతగా ఉండేది కాదన్నారు. ఇక రాష్ట్రాలకే అలా ఉంటే దేశాలకు అతీతంగా ప్రేక్షకులకి నచ్చుతుందని, ఇంతటి భారీ ఎత్తున ప్రశంసలు వస్తాయని అసలు కలలో కూడా అనుకోలేదని రాజమౌళి తెలిపారు. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమా హాలీవుడ్ ప్రేక్షకుల ఆదరణను విశేష స్థాయిలో పొందింది అన్న విషయం తెలిసిందే. జపాన్‌లో ప్రేక్షకులకు కూడా ఆర్ఆర్ఆర్ చాలా బాగా నచ్చింది. అయితే అక్కడ వారి రివ్యూలని చూసి స్వయంగా రాజమౌళి షాక్‌కు గురయ్యారట.

హాలీవుడ్ ప్రేక్షకులతో పాటు అక్కడి స్టార్లు, హాలీవుడ్ దర్శకులు మరియు ప్రొడ్యూసర్లకు కూడా మన తెలుగు సినిమా నచ్చింది. ఇది ఖచ్చితంగా మనందరికీ గర్వంగా అనిపించే విషయం. ఐతే హాలీవుడ్‌కు నచ్చుతందని తన శైలిని మార్చుకోలేనని రాజమౌళి అన్నారు. హాలీవుడ్ తరహాలో సినిమాని తెరకెక్కించడం తనకు రాదని, సొంత శైలిలోనే ఉన్నంతలో ప్రత్యేకంగా తీయడమే వచ్చు అని చెబుతూ.. ఒకవేళ తను తన శైలిని మార్చుకుని సినిమాలు తీస్తే అవి హాలీవుడ్ ప్రేక్షకులకి నచ్చకపోవవచ్చు అన్నారు రాజమౌళి.

READ  బింబిసార సీక్వెల్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం - కళ్యాణ్ రామ్

రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక మహేష్ బాబు హీరోగా ఓ అడ్వెంచర్ మూవీని తెరకెక్కించడానికి జక్కన్న రెడీ అవుతున్నారు. ఇక ఇదే క్రమంలో తన విజయపథానికి తొలి మెట్టైన బాహుబలి చిత్రం గూర్చి రాజమౌళి మాట్లాడారు.

భారతదేశంలో ఉన్న అన్ని చలన చిత్ర పరిశ్రమల కంటే తెలుగు సినిమా పరిశ్రమ ఎక్కువగా రామాయణం మరియు మహాభారతం నుంచి స్ఫూర్తి పొంది చిత్రాలను నిర్మించిందని రాజమౌళి అన్నారు. ఈ రెండు ఇతిహాసాలలో చాలా భావోద్వేగాలతో పాటు ఎంతో నాటకీయత మరియు పోరాట అంశాలు ఉన్నాయి. అందుకే రామాయణం, మహాభారతాల సారాంశాన్ని తీసుకుని కథలను రూపొందించి సినిమాలు తీయగలిగితే ఆ సినిమాలను కేవలం తెలుగు వారికే పరిమితం చేయనవసరం లేదని ఆయన అన్నారు.

బాహుబలి కూడా అలాంటి స్ఫూర్తితో తెరకెక్కించిన సినిమా అని, అందువల్లే భాష, జాతి భేదాలకు అతీతంగా అంతటి భారీ విజయం సాధించి.. భారతదేశంలో సినిమా పరిశ్రమ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, మరెన్నో పరిశ్రమలు ఉన్నాయి అన్న విషయాన్ని అందరికీ తెలిసేలా చేసిందని, ప్రత్యేకించి తెలుగు సినిమా పరిశ్రమ గురించి తెలుసుకోవడం ప్రారంభించారని రాజమౌళి చెప్పారు.

ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీ కూడా ప్యాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు అంటే అందుకు ముఖ్య కారణం బాహుబలి సినిమా సాధించిన విజయం, ఇచ్చిన స్ఫూర్తి వల్లే అనేది నూటికి నూరు పాళ్ళూ నిజం.

READ  SSMB28: పోకిరి డేట్ కు రానున్న మహేష్ - త్రివిక్రమ్ సినిమా

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories