Homeసినిమా వార్తలుAnurag Kashyap Important Role in Dacoit 'డెకాయిట్' లో కీలక రోల్ చేస్తున్న అనురాగ్...

Anurag Kashyap Important Role in Dacoit ‘డెకాయిట్’ లో కీలక రోల్ చేస్తున్న అనురాగ్ కశ్యప్ 

- Advertisement -

యువ నటుడు అడివి శేష్ హీరోగా యువ అందాల నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ మూవీ డెకాయిట్. ప్రారంభం నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీలో హీరోయిన్ గా మొదట శృతి హాసన్ ని తీసుకున్నారు, అయితే కొన్ని కారణాల రీత్యా ఆమె స్థానంలోకి మృణాల్ వచ్చారు. 

ఎస్. ఎస్. క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై సుప్రియ యార్లగడ్డ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం వేగవంతంగా జరుగుతోంది. భీమ్స్ సిసిలోరియో సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీలోని కీలకమైన ఇన్స్పెక్టర్ స్వామి రోల్ లో కనిపించనున్నారు బాలీవుడ్ దర్శకుడు కం నటుడు అయిన అనురాగ్ కశ్యప్. 

ఆయన ఫస్ట్ లుక్ ని నేడు రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. తెలుగుతో పాటు అటు హిందీలో కూడా ఏకకాలంలో చిత్రీకరించబడుతున్న ఈ మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది. 

ఇద్దరు మాజీ ప్రేమికులు వరుస దొంగతనాల కోసం తిరిగి ఏకం కావడానికి దారితీసే కథగా ఈ మూవీ ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కుతుంది, ఇది వారి జీవితాలను ఆపై ఎలా మారుస్తుందనేది మూవీలో దర్శకుడు షానియల్ డియో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది యూనిట్. 

Follow on Google News Follow on Whatsapp

READ  Devisri Prasad as RC17 Music Director RC 17 మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ఫిక్స్ ?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories