ఇటీవల హీరో సుధీర్ బాబు చేసిన సినిమాలు ఓపెనింగ్ రోజే పరాజయం పాలవడం పరి పాటిగా మారింది. తాజాగా ఆయన నటించిన హంట్ చిత్రం విషయంలోనూ అదే జరిగింది. రిపబ్లిక్ డే రోజు రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమా పై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో దాదాపు అన్ని థియేటర్లలోనూ ఈ సినిమా డెఫిషిట్లను నమోదు చేసింది.
సుధీర్ బాబు గత కొన్నేళ్లుగా హిట్ కోసం కష్టపడుతున్నారు. కాగా తాజాగా హంట్ అనే యాక్షన్ థ్రిల్లర్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ముంబై పోలీస్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.
మహేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్ బాబు ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించారు. శ్రీకాంత్, భరత్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అసిస్టెంట్ కమిషనర్ అర్జున్ ప్రసాద్ (సుధీర్ బాబు) కథతో ‘హంట్’ సినిమా సాగుతుంది. అతను అనుకొని రోడ్డు ప్రమాదానికి గురవుతాడు, దాని వల్ల అతను జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. ప్రమాదానికి ముందు, అతను తన సన్నిహితుడు మరియు ఎసిపి ఆర్యన్ దేవ్ (భరత్ నివాస్) హత్య కేసును దర్యాప్తు చేస్తూ ఉంటాడు.
ప్రమాదం తరువాత, అర్జున్ ప్రసాద్ యొక్క మరొక సహచరుడు, పోలీసు కమిషనర్ మోహన్ భార్గవ్ (శ్రీకాంత్) అర్జున్ కు తన జ్ఞాపకశక్తి నష్టాన్ని డిపార్ట్మెంట్లోని ఎవరికీ చెప్పకుండా కేసు పై పనిచేయమని అడుగుతారు. ఆర్యన్ దేవ్ ను ఎవరు చంపారు? అర్జున్ ఈ కేసును సాల్వ్ చేశాడా? అర్జున్ కు జ్ఞాపకం వచ్చిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలే మిగతా కథ.