నాగార్జున తాజాగా నటించిన ది ఘోస్ట్ సినిమా దసరా పండుగ కానుకగా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నాగార్జున కెరీర్ కి ఎంతో కీలకమైన చిత్రం. అంతే కాకుండా ఆయన ఈ సినిమాల పై ఎన్నో ప్రాజెక్ట్ పై చాలా ఆశలు కూడా పెట్టుకున్నారు. కానీ ది ఘోస్ట్ చిత్ర ఫలితం మాత్రం ఆయనను చాలా నిరాశపరిచిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రం ఘోర పరాజయం దిశగా పయనిస్తోంది.
యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ది ఘోస్ట్.. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద చాలా తక్కువ నంబర్లను నమోదు చేసి ఘోరమైన ఓపెనింగ్స్ సాధించింది. కాగా రెండవ రోజు ఈ చిత్రం దారుణంగా పడిపోయింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలా థియేటర్ల అద్దెలను వసూలు చేయడంలో కూడా ఈ చిత్రం విఫలమయింది.
పండగ సీజన్లో వచ్చి ఇంత తక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం నిజంగా దారుణమనే చెప్పాలి. నిజానికి చాలా కాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ నాగార్జున ఒకేసారి పోటీగా సినిమాలను విడుదల చేయనున్నారు అని తెలియగానే ఇరు వర్గాల అభిమానులు చాలా ఉత్సాహంతో ఈ పోటీ కోసం ఎదురు చూశారు. కాగా గాడ్ ఫాదర్ సినిమాకి ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన రాగా.. ది ఘోస్ట్ సినిమాకు మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే దాదాపు 20 కోట్లకు పైగా షేర్ సాధించాలి.
కానీ ఈ సినిమా నాగార్జున కెరీర్లో మరో సింగిల్ డిజిట్ క్లోజింగ్ షేర్ సినిమాగా నిలిచే దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఉన్న దారుణమైన వసూళ్ల ప్రకారం, ఈ చిత్రం ఫుల్ రన్ లో 5 కోట్ల కంటే తక్కువ షేర్‌తో ముగిసేలా కనిపిస్తొంది.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాగార్జున ఒక ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. జయప్రకాష్, గుల్ పనాగ్ మరియు అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో ఇతర ప్రముఖ తారాగణం.
కాగా ఘోస్ట్‌లో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.