ఇటీవల రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ ఆనిమల్. ఈ మూవీలో అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించగా రిలీజ్ అనంతరం ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది.
ఓవరాల్ గా ఆనిమల్ మూవీ రూ. 900 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుని కెరీర్ పరంగా అటు రణభీర్ కి దర్శకుడుగా సందీప్ రెడ్డి వంగాకి విశేషమైన పేరు తీసుకువచ్చింది. నిజానికి ఎంతో పెద్ద భారీ విషయం అందుకున్నప్పటికీ ఆనిమల్ పై అనేకమంది విమర్శలు అయితే ఎక్కుపెట్టారు. ముఖ్యంగా అందులో పలు సన్నివేశాలపై తీవ్ర విమర్శలు చేశారు.
అంతకుముందు ఆనిమల్ సినిమాకు సంబంధించి సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ సినిమాని సినిమాగా చూడాలని, కొన్ని సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి ఎవరిని తక్కువ చేయాలనే తీసింది కాదని చెప్పుకొచ్చారు. మరోవైపు తాజాగా వస్తున్న విమర్శలు అన్ని కూడా సందీప్ రెడ్డి వంగా చుట్టూనే ఉంటున్నాయి. మొదటి నుంచి ఆయననే టార్గెట్ చేస్తూ కావాలని విమర్శలు ఎక్కువ పెడుతుండడం పై పలువురు నెటిజెన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అందులో హీరోగా నటించిన రణబీర్ కపూర్ పై ఎవరూ కూడా ఒక్క మాట అనటం లేదని, అయితే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మాత్రమే సినిమాకి పూర్తిగా బాధ్యుడంటూ ఆయన్ని నిందించడం సరికాదని అంటున్నారు.
మరోవైపు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా సందీప్ రెడ్డి వంగా కూడా మాట్లాడుతూ దర్శకుడుగా తనపై ఇంత విమర్శలు చేస్తున్న ఏఒక్కరు రణబీర్ గురించి మాట్లాడరు, నిజానికి రణబీర్ తో తనకు మంచి సన్నిహిత్యం ఉందని, ఆయనని అనాలనేది తన ఉద్దేశం కాదనన్నారు. కాకపోతే తనపై విమర్శలు చేసే వారికి రణబీర్ తో ఉన్న సాన్నిహిత్యం చెడిపోగూడదని భావించే ఆయనని ఏమి అనడం లేదన్నారు.
రాబోయే రోజుల్లో వారు ఆయనతో సినిమాలు చేయాలనుకుంటున్నారు కాబట్టే ఆయనను కాకుండా తనని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక త్వరలో ఆనిమల్ కి సీక్వెల్ అయిన యానిమల్ పార్క్ కోసం తాను స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు సందీప్.