Homeసినిమా వార్తలుAgent: ఏజెంట్ విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి పై అసంతృప్తితో ఉన్న అనిల్ సుంకర ?

Agent: ఏజెంట్ విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి పై అసంతృప్తితో ఉన్న అనిల్ సుంకర ?

- Advertisement -

ఏజెంట్ సినిమా విషయంలో నిర్మాత అనిల్ సుంకర, సురేందర్ రెడ్డిల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం. అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా కోసం దర్శకుడు అసలు బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టడంతో అనిల్ సుంకర విసుగు చెందారట.

2021లో సినిమా షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమా రెండేళ్లు దాటినా ఇప్పటికీ మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి కాలేదు. ఏజెంట్ ను ఇదివరకు నెలల తరబడి నిలిపివేసి, చివరకు ఎలాగో పనులు చక్కదిద్ది మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతున్నా సినిమా నిర్మాణం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఏప్రిల్ 28న ‘ఏజెంట్’ విడుదల కావాల్సి ఉన్నా బజ్, ప్రమోషన్స్ అనుకున్న స్థాయిలో లేవు.

అందుకే సరైన ప్రచార కార్యక్రమాలతో సినిమా విడుదలను పక్కాగా ప్లాన్ చేయాలని అఖిల్ అక్కినేని అభిమానులు అనిల్ సుంకర పై ఒత్తిడి తెస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఆయన్ను సంప్రదిస్తున్నారు కానీ ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేసే మూడ్ లో ఈ నిర్మాత లేనట్లే కనిపిస్తుంది.

READ  Veera Simha Reddy OTT: ఈరోజు నుంచి ఓటీటీలో ప్రసారం కానున్న బాలకృష్ణ వీరసింహారెడ్డి

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అఖిల్ సరసన హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తుండగా, మలయాళ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ సింగిల్ ప్రోమోను ఈ రోజు విడుదల చేయనుండగా, ఫుల్ సాంగ్ ను శుక్రవారం అంటే మార్చి 24న విడుదల చేయనున్నారు.

https://twitter.com/AKentsOfficial/status/1637794617470099457?t=sXpQOu3ay7EF_rAZ4Y7pXw&s=19

Follow on Google News Follow on Whatsapp

READ  Agent: షూటింగ్ చివరి దశలో ఉన్న అఖిల్ పాన్ ఇండియా సినిమా ఏజెంట్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories