అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్ జంటగా నటించిన బుట్టబొమ్మ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం అయింది. మలయాళ చిత్రం కప్పెలా కు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బుట్టబొమ్మ ఫిబ్రవరి ప్రారంభంలో విడుదలై బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమై తొలి రోజే చాలా చోట్ల థియేటర్లు ఖాళీగా కనిపించాయి.
ఒరిజినల్ మలయాళ వెర్షన్ లో శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యూ, అన్నా బెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు వెర్షన్ లో అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక చిన్న పట్టణానికి చెందిన ఒక అమాయక యువతి ఫోన్ కాల్స్ ద్వారా ఒక ఆటోరిక్షా డ్రైవర్ తో ప్రేమలో పడటం అనే అంశం చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది కథ సారాంశం.
కొత్త దర్శకుడు ఎస్.చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన బుట్టబొమ్మ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. తమిళం, మలయాళంలో పలు ప్రాజెక్టులలో హీరోయిన్ గా పని చేస్తున్న అనిఖా సూరేంద్రన్ ఇప్పుడు పూర్తి స్థాయి హీరోయిన్ గా మారిపోయారు.