Homeసినిమా వార్తలుSuma Son: హీరోగా పరిచయం అవుతున్న యాంకర్ సుమ కనకాల తనయుడు

Suma Son: హీరోగా పరిచయం అవుతున్న యాంకర్ సుమ కనకాల తనయుడు

- Advertisement -

ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనయుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా పరిచయం అవుతున్నారు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్ పేరెపు దర్శకత్వంలో మహేశ్వరి మూవీస్ పతాకం పై ఈ కొత్త చిత్రం రూపొందుతోంది. ప్ర

ముఖ యాంకర్ సుమ కనకాల మరియు నటుడు రాజీవ్ కనకాల కుమారుడైన రోషన్ కనకాల తొలిసారి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను పి.విమల చూసుకుంటున్నారు.

రోషన్ కనకాల బర్త్ డే సందర్భంగా డీజేగా వైబ్రెంట్ అవతారంలో ఉన్న పోస్టర్ ను చిత్ర బృందం ఇటీవలే విడుదల చేసింది. ఈ పోస్టర్లో రోషన్ కర్లీ హెయిర్, సన్ గ్లాసెస్ ధరించి, హెడ్సెట్ ధరించి డీజే సిస్టమ్లో మ్యూజిక్ ప్లే చేస్తున్నారు.

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా కొత్తతరం రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం, నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవికాంత్ పేరెపుతో పాటు విష్ణు కొండూరు, శేరి-గన్ని ఇతర రచయితలు కాగా, వంశీకృష్ణ స్క్రీన్ ప్లేకు కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్నారు. శివంరావు ప్రొడక్షన్ డిజైన్ మేనేజర్.

తీసిన కొన్ని సినిమాలతోనే తనకంటూ ప్రత్యేకమైన టేకింగ్, న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీలకు పెట్టింది పేరైన రవికాంత్ పేరెపు నుంచి వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత గానో ఎదురుచూస్తున్నారు.

READ  Tammareddy: ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్ పై దర్శకుడు తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యల పై మండిపడిన నాగబాబు, రాఘవేంద్రరావు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories