కోలీవుడ్ యువ నటుడు శివ కార్తికేయన్ హీరోగా అందాల టాలెంటెడ్ నటి సాయి పల్లవి హీరోయిన్ గా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బయోగ్రఫికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అమరన్. ఈ మూవీకి జివి ప్రకాష్ సంగీతం అందించగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థలు దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి. దేశంకోసం అశువులు బాసిన మిలిటరీ యోధుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ ఆధారంగా రూవుపొందిన ఈ మూవీలో హీరో శివ కార్తికేయన్ టైటిల్ రోల్ పోషించగా ఇతర పాత్రల్లో భువన్ అరోరా, రాహుల్ బోస్, శ్రీ కుమార్, శ్యామ్ మోహన్ తదితరులు నటించారు.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈమూవీ నేడు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ గత కాలాన్ని వివరించే ఆయన భార్య ఇంధు రెబెక్కా వర్గీస్ కథగా ఈ మూవీ రూపొందింది. ముఖ్యంగా టైటిల్ రోల్ లో శివ కార్తికేయన్ ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ అందించగా ఇంధు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించారు అనడం కంటే జీవిచారని చెప్పాలి. ముఖ్యంగా పలు ఎమోషనల్ సన్నివేశాల్లో సాయి పల్లవి యాక్టింగ్ హృదయానికి హత్తుకుంటుంది.
సోల్జర్ విక్రమ్ సింగ్ పాత్రలో నటించిన భువన్ అరోరా, అమరన్ తారాగణానికి మరో ప్లస్ పాయింట్. రాహుల్ బోస్, గీతా కైలాసం, లల్లు, శ్రీకుమార్ మరియు పలువురు ప్రధాన పాత్రల్లో తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని ఆడియన్స్ ని అలరించేలా పలు సన్నివేశాలు ఎంతో చక్కగా తీశారు. అక్కడక్కడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ ఆకట్టుకునే ఎమోషనల్ ఎంటర్టైనర్ గా అమరన్ ఆడియన్స్ మెప్పు పొందింది. ముఖ్యంగా సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ బాగున్నాయి. ఓవరాల్ గా మంచి టాక్ ని సొంతం చేసుకున్న అమరన్ బాగానే ఓపెనింగ్స్ ని అందుకోగా రాబోయే రోజుల్లో ఎంతమేర బాక్సాఫీస్ వద్ద రాబడుతుందో చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
- శివకార్తికేయన్ మరియు సాయి పల్లవి
- జివి ప్రకాష్ బిజిఎమ్
- విజువల్స్
- రాజ్‌కుమార్ పెరియసామి సున్నితమైన రచన
మైనస్ పాయింట్స్ :
- సుదీర్ఘమైన యాక్షన్ సన్నివేశాలు
- ఊహించగలిగే కథనం
మొత్తంగా చెప్పాలి అంటే అమరన్ మూవీ యొక్క కథ పేట్రియాటిక్ అంశానికి సంబంధించింది అయినప్పటికీ, దర్శకుడు నైపుణ్యంగా యాక్షన్ ఎమోషనల్ కమర్షియల్ అంశాలను జోడించి చక్కటి కథనంతో దీనిని నడిపించాడు. ప్రధాన పాత్రల యొక్క ఆకట్టుకునే పెరఫార్మన్స్ తో పాటు విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎమోషన్స్, వంటివి ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. హృద్యమైన ఎమోషనల్ కథలని కోరుకునే వారికి ఈ మూవీ మరింతగా నచ్చుతుంది.
రేటింగ్ : 3 / 5