Homeసినిమా వార్తలుMahesh Babu: మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా ఆల్టర్నేట్ రిలీజ్ ప్లాన్స్

Mahesh Babu: మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా ఆల్టర్నేట్ రిలీజ్ ప్లాన్స్

- Advertisement -

జనవరి 18 నుంచి మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఆగస్టు 11న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తేదీకి అనుగుణంగా ఉండేలా షూటింగ్ షెడ్యూల్స్ ను కూడా సిద్ధం చేశారు. అయితే ఏ కారణం చేతనైనా సినిమా షూటింగ్ ఆలస్యమైతే మరో తేదీని కూడా SSMB28 టీం సిద్ధంగా పెట్టుకుంది.

ఆ రకంగా షూటింగ్ సమయంలో ఏదైనా ఆలస్యమైతే దసరా లేదా దీపావళి సీజన్ లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను ఎలాగైనా 2023లో విడుదల చేయాలనుకుంటున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో మహేష్ బాబు నటించిన SSMB28 ఒకటి. దాదాపు 12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్, మహేష్ కలయికలో వస్తున్న ఈ సినిమా పై మహేష్ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

READ  పుష్ప 2 డైలాగ్ లీక్ - వైరల్ అయి సంచలనం

మహర్షి తర్వాత మహేష్ బాబు సరసన పూజా హెగ్డే రెండోసారి నటిస్తుండగా, మిగతా తారాగణం వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తారని గతంలో చాలా రూమర్స్ వచ్చాయి కానీ నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో SSMB28 అనేది ఒక అవుట్ అండ్ అవుట్ తెలుగు సినిమాగానే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Naresh: సూపర్ స్టార్ కృష్ణ సంతకాలను నరేష్ ఫోర్జరీ చేశారని ఆరోపించిన ఆయన భార్య


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories