సినిమాగౌరవం సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ తక్కువ కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపును సాధించుకున్నాడు. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు.
శిరీష్ నుంచి చివరగా వచ్చిన “ఎబిసిడి” చిత్రం ఊహించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా,శిరీష్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.ఆ తరువాత ఇప్పటివరకు శిరీష్ నుంచి సినిమాలు రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు శిరీష్ హీరోగా గీతా ఆర్ట్స్ లో చేసిన సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ చేసిన చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ టీజర్ ,త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.తర్వాత వారం నుండి ఈ చిత్ర ప్రోమోషన్స్ ను మొదలుపెట్టనున్నారు.