టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు శిరీష్ హీరోగా తెరంగేట్రం చేసి చాలా సినిమాలు చేసినా చెప్పుకోదగ్గ హిట్ అందుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థుతులలో తాజాగా ఆయన నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాలో అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్లు కూడా బాగుంటాయి అని అంతా అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన కలెక్షన్లు రాబట్టలేక మొత్తానికి యావరేజ్‌గా నిలిచింది.
ఇక థియేటర్లలో సరైన సందడి చేయడంలో విఫలమైన ఈ సినిమా అనుకున్న సమయం కంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. ఊర్వశివో రాక్షసివో ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఒకటైన ఆహా ఫ్లాట్ ఫారంలో థియేట్రికల్ విడుదల నుండి నాలుగు వారాల తర్వాత అంటే డిసెంబర్ 9 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన వెలువడింది.
GA2 పిక్చర్స్, తిరుమల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ధీరజ్, విజయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి అచ్చు, అనుప్ సంగీతం అందించారు. కాగా ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్, పోసాని, ఆమని కీలక పాత్రలు పోషించారు.