Homeసినిమా వార్తలురష్యాలో అల్లు అర్జున్ 'పుష్ప' భారీ పరాజయాన్ని చవిచూసిందా?

రష్యాలో అల్లు అర్జున్ ‘పుష్ప’ భారీ పరాజయాన్ని చవిచూసిందా?

- Advertisement -

అల్లు అర్జున్ నటించిన పుష్ప డిసెంబర్ 8న రష్యాలో థియేటర్లలో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు, పుష్ప ది రైజ్ బృందం రష్యా వెళ్లి ఆ దేశంలో సినిమాను ప్రమోట్ చేశారు. వీరితో పాటు రష్మిక మందన్న కూడా ఉన్నారు.

ఏదేమైనా, బృందం రష్యాకు వెళ్లి సినిమాను ప్రచారం చేసినప్పటికీ, నిర్మాతలు రష్యన్ భాషలోకి డబ్ చేయడానికి, సినిమాను ప్రమోట్ చేయడానికి మరియు విడుదల చేయడానికి కొంత గణనీయమైన మొత్తాన్ని పెట్టుబడి పెట్టినప్పటికీ వారి ప్రయత్నాలు వ్యర్థమైనట్లు అనిపిస్తుంది.

పుష్ప ది రైజ్ డిసెంబర్ 8న విడుదల కాగా ఆ తర్వాత నుండీ ఎందుకో గానీ ఆ చిత్ర బృందం మౌనం పాటించింది. చిత్ర ప్రదర్శన గురించి కానీ, విడుదలైన తర్వాత రష్యన్ ప్రేక్షకుల స్పందన లేదా అభిప్రాయాల గురించి కానీ నిర్మాతల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.

ఇదంతా చూస్తుంటే ఈ సినిమా రష్యాలో ఫెయిల్ అయిందనే భావన కలుగుతుంది, ఎందుకంటే ఈ చిత్రం యొక్క బాక్సాఫీసు ప్రదర్శన గురించి కానీ , లేదా ఈ చిత్రం ఫలానా నంబర్ల సాధించింది అని కలెక్షన్లను చెప్తూ కూడా ఎటువంటి అధికారిక ధృవీకరణ ఇవ్వబడలేదు.

ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా భారీ ఎత్తున తెరకెక్కుతోందని సమాచారం. పుష్పరాజ్ పాత్ర మరియు అతని భయంకరమైన శత్రువు ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ మధ్య సంఘర్షణ చుట్టూ పుష్ప ది రూల్ కథ తిరుగుతుంది, పోలీస్ పాత్రలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ నటిస్తారు.

READ  అమితాబ్ బచ్చన్ - రష్మిక గుడ్‌బై OTT రిలీజ్ డేట్ అండ్ స్ట్రీమింగ్ పార్టనర్

పుష్ప ది రూల్ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు, ఆమె పుష్ప ది రైజ్ లో చేసిన శ్రీవల్లి పాత్రను సీక్వెల్ లోనూ కొనసాగించనున్నారు. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ లో ప్రముఖ నటి ప్రియమణిని ఒక ముఖ్యమైన పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

Follow on Google News Follow on Whatsapp

READ  రష్యాలో ల్యాండ్ అయిన పుష్ప: ది రైజ్ టీమ్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories