Homeసినిమా వార్తలుఅల్లు అర్జున్ కొత్త లుక్ వారెవ్వా అంటున్న అభిమానులు

అల్లు అర్జున్ కొత్త లుక్ వారెవ్వా అంటున్న అభిమానులు

- Advertisement -

స్టయిలిష్ స్టార్‌ నుంచి ఐకాన్‌ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌ `పుష్ప` సినిమాతో దేశ వ్యాప్తంగా తన స్థాయిని పెంచుకున్నారు. ఈ సినిమా భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో పుష్పగా బన్నీ చెప్పిన డైలాగ్ లు, మ్యానరిజం ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తగ్గేదేలే డైలాగ్ చెబుతూ ఇన్స్టా రీల్స్ చేసి సందడి చేస్తున్నారు. ఇప్పటికి కూడా బన్నీ మ్యానరిజంతో కూడిన వీడియోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఈ హవా తగ్గకముందే మరో డిఫరెంట్‌ లుక్‌లో కనుపించి అందరినీ విస్మయ పరిచారు అల్లు అర్జున్‌. సాల్ట్ పెప్పర్‌ లుక్‌లోకి మారి ప్రేక్షకులకి తీయని షాకిస్తున్నారు. స్టయిలిష్ లుక్ అదిరింది అనిపించే బన్నీ కొత్త లుక్‌ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నోట్లో బీడీ కట్ట, నెరిసిన తెల్ల జుట్టు, డిఫరెంట్‌ సైడ్‌ హెయిర్‌ కట్టింగ్‌లతో సరికొత్తగా కనిపిస్తున్నారు. తాజాగా ఈ కొత్త లుక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఐకాన్‌ స్టార్‌ కొత్త లుక్ చూసి ఆయన ఫ్యాన్స్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

అయితే ఇంతలా పాపులర్ అయిన ఈ కొత్త లుక్ ఒక సినిమా లుక్‌ కాదు, ఓ యాడ్‌ కోసం చేసిన లుక్‌ కావడం విశేషం.బన్నీ `పుష్ప2` షూటింగ్ ఆలస్యం అవడం వల్ల ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. ఈ గ్యాప్‌లో ఆయన యాడ్స్ తో బిజీగా గడుపుతున్నారు. మొన్ననే త్రివిక్రమ్‌తో ఓ యాడ్‌ చేసిన అల్లు అర్జున్‌ ఇప్పుడు మరో యాడ్‌ చేశారు.

READ  అన్‌స్టాపబుల్ 2 లో మెగాస్టార్?

తాజాగా హరీష్‌ శంకర్‌తో మరో కొత్త యాడ్‌ చేశారు. `ఆస్ట్రాల్‌ పైప్స్` అనే సంస్థ కోసం చేసిన యాడ్‌లో తాజాగా బన్నీ నటించారు. దీని కోసం ఈ కొత్త లుక్‌ లోకి మారిపోయారు. హరీష్‌ శంకర్‌ ఈ యాడ్‌ ను డైరెక్ట్ చేయగా, బన్నీ న్యూ ట్రాన్ఫ్సర్మేషన్‌తో అదరగొడుతున్నారు. జస్ట్ లుక్ ఏ ఇలా ఉంటే, ఇక యాడ్‌లో ఆయన ఏ విధంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్‌ ఈ కొత్త లుక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  RRR Movie: ఇప్పటికీ తగ్గని ఆర్ ఆర్ ఆర్ హవా


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories