Homeసినిమా వార్తలుబింబిసార చిత్రాన్ని మెచ్చిన అల్లు అర్జున్

బింబిసార చిత్రాన్ని మెచ్చిన అల్లు అర్జున్

- Advertisement -

బింబిసార విజయం తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో ఆనందాన్ని మరియు ఉత్సాహాన్ని నింపింది. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో ప్రశంసించారు. ఇటివలే మెగాస్టార్ చిరంజీవి బింబిసార మరియు సీతా రామం చిత్రాలను పొగుడుతూ ట్వీట్ చేశారు.

ఆయన తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా బింబిసార సినిమా విజయం పై కళ్యాణ్ రామ్ మరియు మల్లిడి వశిష్టను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

బింబిసార చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. ఇది ఎంతో ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన ఫాంటసీ చిత్రం అని చెబుతూ.. కళ్యాణ్ రామ్ గారు తన ప్రభావవంతమైన ఉనికిని చాటుకుంటూ ఎప్పుడూ ప్రతిభావంతులైన వారిని పరిశ్రమలోకి తీసుకు వచ్చి కొత్త తరహా సినిమాలను ట్రై చేస్తున్నందుకు ఆయనంటే ఎంతో గౌరవం ఉందని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

అలాగే ఈ చిత్రాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించిన దర్శకుడు వశిష్టను కూడా ఆయన అభినందించారు. దాంతో పాటు సినిమాకు పని చేసిన ఇతర సాంకేతిక నిపుణులకు, ఆర్టిస్టులందరికీ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ఇక ఈ చిత్రానికి నేపథ్య సంగీతంతో వెన్నెముకలా నిలిచిన కీరవాణి గారికి.. హీరోయిన్లు క్యాథరీన్ త్రెసా, సంయుక్త మీనన్ లను కూడా అల్లు అర్జున్ అభినందించారు.

అల్లు అర్జున్ తో పాటు దర్శకులు కె. రాఘవేంద్రరావు, బాబీ కూడా ఈ సినిమాకి తమ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

READ  సౌత్ ఇండియన్ సినిమాకి ఐకాన్ గా నిలిచిన అల్లు అర్జున్

ఇక బింబిసార సినిమా.. గత కొంతకాలంగా కష్టాల్లో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమకు చలనం తెస్తూ, అన్ని వయసుల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తొలి రోజు నుంచీ ఈ చిత్రం అన్ని సెంటర్లలో నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు వసూళ్లు సాధించింది. ఇప్పటికే చాలా ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్ సాధించి లాభాల్లోకి దూసుకుపోతోంది.

ఈ వసూళ్లతో చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజుతో దాదాపు బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసిన బింబిసార.. మరి తన దూకుడును ఎంత కాలం కొనసాగించి పంపిణీదారుల పెట్టుబడికి ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  Box-office: మరో రికార్డ్ కొట్టిన విక్రమ్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories